30.7 C
Hyderabad
July 2, 2024 14: 47 PM
Slider విజయనగరం

“మీ క్రమ శిక్షణ, అంకిత భావమే ఇతర ఉద్యోగులకు స్ఫూర్తి”

సుదీర్ఘ కాలం విజయనగరం జిల్లా పోలీసు శాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన (1) బొబ్బిలి ఎస్ఐ చదలవాడ సత్యన్నారాయణ (2) బొబ్బిలి ట్రాఫిక్ ఎస్ఐ వి.బి.రామకృష్ణారావు (3) స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ ఎస్. షణ్ముఖరావు (4) కమ్యునికేషన్ ఎస్.ఐ ఆర్.సత్యం (5) పోలీసు కంట్రోల్ రూం ఎఎస్ఐ షేక్ జిలానీ (6) పోలీసు కంట్రోల్ రూం ఎఎస్ఐ పి.అరుణకుమారి (7) కొత్తవలస ఎస్ఐ పి.రాజులు (8) స్పెషల్ బ్రాంచ్ ఎఎస్ఐ నాగరాజు (9) ఎఆర్ హెచ్.సి. ఎ. వీరభద్ర రాయుడు (10) పోలీసు కంట్రోల్ రూం కానిస్టేబుల్ ఎం. పైడిరాజులకు జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ ఎం. దీపిక, జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా “ఆత్మీయవీడ్కోలు” పలికారు.

ఈ “ఆత్మీయ వీడ్కోలు” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు శాఖకు సుదీర్ఘ కాలం నిస్వార్థంగా సేవలందించి, పోలీసుశాఖకు మంచి పేరు తీసుకువచ్చారన్నారు. విధి నిర్వహణలో వారి చూపిన క్రమ శిక్షణ, అంకిత భావమే వారిని పోలీసుశాఖలో ఉన్నతంగా నిలిపిందని, ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచిందని, పోలీసుశాఖకు వారు అందించిన సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అవుతున్న పోలీసు అధికారులు, సిబ్బంది వారి విధులను సక్రమంగా నిర్వహించడంతోపాటు, వారి పిల్లలను ఉన్నతంగా చదివించి, తమ కాళ్ళపై వారు నిలబడే విధంగా చేసారన్నారు. ఉద్యోగ విరమణ తరువాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కుటుంబంతో కొంత సమయాన్ని గడిపే విధంగా చూసుకోవాలని, సమాజానికి మంచి చేసేందుకు కృషి చెయ్యాల్సిందిగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక సూచించారు. అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఎస్ఎస్ఐలు చదలవాడ సత్యన్నారాయణ, వి.బి.రామకృష్ణారావు, ఎస్.షణ్ముఖరావు, ఆర్.సత్యం, ఎఎస్ ఐలు షేక్ జిలానీ, పి.అరుణకుమారి, పి. రాజులు, ఎస్.నాగరాజు, ఎఆర్ హెచ్.సి. వీరభద్ర రాయుడు మరియు కానిస్టేబుల్ ఎం. పైడిరాజు ల దంపతులను పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ ఎం.దీపిక సాలువలు, పూలమాలలు, పండ్లు, గిఫ్ట్, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి, “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.

అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరుపున జిల్లా ఎస్పీ జ్ఞాపికలను, చెట్లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు వారి సర్వీసులో సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుశాఖ తరుపున ఎస్పీ తమకు “ఆత్మీయ వీడ్కోలు” ను పలకడం, సన్మానించడం తమ జీవితంలో ఎన్నటికీ మరువలేమని జిల్లా అదనపు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) అస్మా ఫర్హీన్, డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐలు కె.కె.వి.విజయనాధ్, ఇ.నర్సింహమూర్తి, డీసీ ఆరీబీ సీ ఐ జె. మురళి, కంట్రోల్ రూమ్ సిఐ రాజశేఖర్ రావు, ఆర్ఎస్ఐలు గోపాలనాయుడు, భగవాన్, రమేష్ కుమార్, ఆర్ఎస్ఐలు సూర్యనారాయణ, రామారావు, ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

డ్రై డే సందర్బంగా తనిఖీలు

Bhavani

టిఆర్ఎస్ ప్రభుత్వంలో సహకార సంఘాలు అభివృద్ధి

Murali Krishna

దళిత నాయకుడైన మోత్కుపల్లి ఆత్మ విమర్శ చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment