27.2 C
Hyderabad
July 2, 2024 21: 16 PM
Slider ప్రత్యేకం

మండల పార్టీ నాయకుడే అటవీ భూమి కబ్జాదారుడు

#penchikalpet

అటవీ అధికారులు రెండుసార్లు కేసు బుక్ చేశారు

చార్జిషీట్ కు మీనమేషాలు లెక్కిస్తున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు.

బిజెపి మండల నాయకులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది.

అసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలోని లోడుపల్లి గ్రామ శివారులో దాదాపు 6 ఎకరాల అటవీ భూమి ఓ పార్టీ పేరు చెప్పుకునే మండల నాయకుడు చౌదరి తిరుపతి ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ భూమిని ఆక్రమించి ఏకంగా దొంగ విద్యుత్ కనెక్షన్  తీసుకొని చుట్టూ కంచను కూడా ఏర్పాటు చేసుకొని అక్రమంగా అతను పామాయిల్ తోటను పండిస్తున్నాడు.

ఇందులో బోరు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మెయిన్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉన్నది అయినా కూడా అటవీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. అటవీ అధికారులు అడగగా నాయకుల ఒత్తిడితోనే చర్యలు తీసుకోలేదని రెండుసార్లు కేసు కూడా బుక్ చేశామని POR 3262/09  తేదీ 02/12/2002 చార్జిషీట్ మాత్రం చేయలేదని తెలిపారు.

ఈ విషయం విద్యుత్ శాఖను AE సంప్రదించ గా అందుబాటులోకి రాలేదు. ఇదివరకు ఇదే నాయకుడు పెంచికల్ పేట మండలం  ప్రధాన రహదారి ప్రక్కన అటవీ భూమి ఆక్రమించి ఏకంగా కమర్షియల్ షట్టర్లే కట్టేశాడు. అధికారులు అడ్డుపడగా ఏకంగా అటవీ అధికారిని ట్రాన్స్ఫర్ చేయించాడు. తరువాత హైకోర్టు కెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈ కేసును పక్కకు పెట్టించాడు. అధికారం మా చేతిలో ఉంది చట్టమే మా చుట్టం అన్నట్టు సాగుతుంది.

ఇప్పటికైనా సామాన్యులకు న్యాయం నాయకులకు న్యాయం కాకుండా అందరికీ ఒకేలా న్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts

వంటగ్యాస్ భారం మొత్తం కేంద్రానిదే: మాకు సంబంధం లేదు

Satyam NEWS

గ్రామాల అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేదు

Satyam NEWS

మహారాష్ట్రలో జెండా ఎగరవేసిన బీఆర్ యస్

Bhavani

Leave a Comment