29.7 C
Hyderabad
May 4, 2024 03: 50 AM
Slider ముఖ్యంశాలు

మహారాష్ట్రలో జెండా ఎగరవేసిన బీఆర్ యస్

#BRS

మహారాష్ట్రలో బీఆర్ యస్ జెండా ఎగర వేసింది. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆవల జరిగిన ఎన్నికల్లో గెలవడంతో బీఆర్ యస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కేసీఆర్ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర పై ఫోకస్ పెట్టారు . ఇప్పటికే మూడు బహిరంగసభలు పెట్టిన పార్టీలో చేరినవారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు .

తెలంగాణకు ఆవల బీఆర్ఎస్ తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఔరంగాబాద్ సమీపంలోని గంగాపూర్ తాలూకా అంబేలోహల్ గ్రామ పంచాయతీ ఒకటో వార్డుకు ఉప ఎన్నిక జరగ్గా ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గఫూర్ సర్దార్ పఠాన్ 115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

Related posts

పేకాట శిబిరాలపై దాడి చేసిన గుడివాడ ఎస్ ఐ ఆత్మహత్య

Satyam NEWS

విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతి పునాది

Satyam NEWS

BJP అధ్యక్షుడిని మార్చకపోతే సామూహిక రాజీనామాలు

Satyam NEWS

Leave a Comment