24.7 C
Hyderabad
July 6, 2024 01: 35 AM
Slider నల్గొండ

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

#kola

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టియు డబ్ల్యూజే,ఐజేయు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశాల్లో కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ టియుడబ్ల్యూజే ఐజేయును బలోపేతం చేసి సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్లు ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు,అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ఉద్యమాలే శరణమని అన్నారు.సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచించి జర్నలిస్టులను సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షుడు గింజల అప్పిరెడ్డి,దాడుల నిరోధక కమిటీ అధ్యక్షుడు బాదే రాము, మల్లం వెంకటేశ్వర్లు గౌడ్,కొడారు బ్రహ్మం, దొడ్డ శ్రీధర్,ఆవుల మల్లికార్జునరావు, అలుగూరి హరినాధ బాబు,తుములూరు సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రెస్ క్లబ్,దాడులు నిరోధక కమిటీలను ప్రకటించారు.జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గా గింజల అప్పిరెడ్డి, కార్యదర్శిగా శంకరమంచి రవీందర్ శర్మ, కోశాధికారిగా తల్లాడ చందన్,

ఉపాధ్యక్షుడు గా వడ్లకొండ శ్రీనివాసు, ధనియాకుల వెంకటేశ్వర్లు,శ్రీరంగం వెంకన్న,చామకూరి వీరయ్య గౌడ్,కీతా రామనాథం,కోటా రాంబాబు,ఆవుల మల్లికార్జున్.వర్కింగ్ ప్రెసిడెంట్ గా అల్దసు శ్యామ్,దొడ్డ శ్రీధర్ చౌదరి  కార్యదర్శులు గా ఎరగాని రమేష్, రణబోతు శ్రీనివాస్ రెడ్డి,వల్లబోయిన రాజేంద్రప్రసాద్,వర్దిల్లి వెంకన్న,తండు నాగేందర్,లంకెల దశరథ రామిరెడ్డి,ఎండి నజీర్,బోల్లెద్దు వెంకటరత్నం. అధికార ప్రతినిధులుగా బత్తిని ధర్మయ్య, ఇట్టిమల్ల రామకృష్ణ,వక్కవంతుల శ్రీనివాసు,ఉయ్యాల నరసయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా తూములూరి సత్యనారాయణ,శిరం శెట్టి ఆనంద్,బొక్కా వీరారెడ్డి,ఈగ శ్రీనివాసరావు,దాచేపల్లి దయాకర్ రెడ్డి,సోమగాని రాంప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా బాచిమంచి చంద్రశేఖర్,బుడిగ శంకర్,బెజవాడ గోవర్ధన్,లక్ష్మణ్,లగిశెట్టి వెంకన్న,వాసా చంద్రశేఖర రావు,సిద్ధల శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షుడు గా బాదే రాము,ప్రధాన కార్యదర్శిగా  కోదాటి విక్రమ్ రావు,లీగల్ అడ్వైజర్ గా దొడ్డ శ్రీధర్ (అడ్వకేట్)ఉపాధ్యక్షులు గా గంధం సైదులు,షేక్ జానీ పాషా,కాసాని మల్లయ్య,గుణగంటి తిరుమలేశు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొడారు బ్రహ్మం, దేనమకొండ శేషం రాజు, అధికార ప్రతినిధిగా కంపాటి వెంకన్న, కొండా సైదులు,పెందుర్తి భాస్కర్,చక్రహరి విక్రమ్ రాజు,కార్యదర్శిగా పల్లె మణి బాబు, ఎండి రెహ్మాన్,విక్రమ్ నాయక్,దేవరం రాంరెడ్డి,నక్క నాగరాజు,తిప్పల సతీష్, కార్యనిర్వాహక కార్యదర్శిగా తుమ్ముల వెంకటేశ్వర్లు,కంచాని కృష్ణమూర్తి, ప్రచార కార్యదర్శిగా దేవరం వెంకటరెడ్డి, అనంతుల వెంకట నర్సు,జె జె సామెల్ సన్,కోశాధికారి పుప్పాల వేణు లను ఎన్నుకున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్

Satyam NEWS

నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసులు

Murali Krishna

విక‌లాంగుల‌కు పించ‌న్ కోసం విజ‌య‌న‌గ‌రంలో టీడీపీ ధర్నా

Satyam NEWS

Leave a Comment