40.2 C
Hyderabad
May 2, 2024 18: 46 PM
Slider వరంగల్

నెంబర్ లేకుండా వాహనం నడిపితే ఛీటింగ్ కేసులు

#ranganath

ఇక వాహనాలపై నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్  వాహనదారులకు హెచ్చరించారు. ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు చోరీ వాహనాలను గుర్తించడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చే జనవరి మొదటి తారీఖు నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయబడుతుందని. అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఏర్పాటు, ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ను వంచిన వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని. ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Related posts

ద కపిల్ శర్మ షో లో జాన్వీకపూర్

Bhavani

మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు

Satyam NEWS

భూ వివాదం పై చంపుతామని న్యాయవాదికి బెదిరింపు

Satyam NEWS

Leave a Comment