37.7 C
Hyderabad
May 4, 2024 14: 31 PM
Slider రంగారెడ్డి

సాంకేతికతను అందిపుచ్చుకొవాలి: సీపీ మహేష్ భగవత్

#rachakondapolice

సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఐటీ సెల్ సిబ్బంది ఎల్లపుడూ ముందు ఉండాలని రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఐటి సెల్ సిబ్బందికి రెండు రోజుల సీసీ కెమెరాల శిక్షణ ఇవ్వడం జరిగింది. నేషనల్ సీసీ టీవీ ట్రైనర్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇప్పించడం జరిగింది. ఈ ట్రైనింగ్ ను ఉద్దేశించి మహేష్ భగవత్ ఈరోజు నేరడ్మెట్ ఆఫీస్ లో మాట్లాడుతూ..   ఐటీ సెల్ సిబ్బందికి ముఖ్యంగా ఇలాంటి సీసీ టివి ట్రైనింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రాచకొండలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇటువంటి శిక్షణ తమ సిబ్బందికి ఇవ్వలని దాని వలన AI సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు నేర నియంత్రణలో భాగంగా మంచి ఫలితాలను పొందే అవకాశం వుందని ఆయన అభిప్రయపడ్డారు. ట్రెయినర్ మదన్ మోహన్ ని మహేష్ భగవత్ మోమేంటోతో సత్కరించారు. ఈ సీసీ టీవీ శిక్షణలో ఎం శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఐటీ సెల్, డి. సునీల్ ఎస్ఐ, సుధాకర్ ఎస్ఐ, శ్రీకాంత్ ఆర్ఎస్ఐ, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు

Satyam NEWS

దేశాన్ని సంరక్షిస్తున్న జవాన్లకు సెల్యూట్

Satyam NEWS

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన కుసుమ జగదీష్

Satyam NEWS

Leave a Comment