30.7 C
Hyderabad
July 2, 2024 13: 33 PM
Slider నల్గొండ

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ఇమాంపేట వద్ద పెట్రోల్ బంక్ ప్రారంభం

#soumyamishra

సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేట వద్ద జైలు శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంకును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్ర ,జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైళ్ళ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ జైళ్ళ శాఖ ద్వారా పెట్రోల్ బంకులు మొదటగా ఉమ్మడి రాష్ట్రంలో కడప జిల్లాలో మొదటి బంకు ప్రారంభమై  ఇప్పటికీ 30 పెట్రోల్ బంకులను ప్రారంభించి నడుపుతున్నట్లు మిశ్ర పేర్కొన్నారు.

సూర్యాపేట రూరల్ మండలంలోని ఇమాంపేటలో ప్రారంభించిన బంకు జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో ఖైదీల ద్వారా ఈ బంకులను నిర్వహిస్తూ, ఖైదీలకు ఉపాధి కల్పిస్తూ, ఖైదీలలో పరివర్తన తీసుకువస్తూ ,వారి కి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆసరాగా నిలుస్తున్నామని మిశ్రా తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ ప్రజలకు పెట్రోల్ బంకు ద్వారా నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించాలని ప్రభుత్వం జైళ్ళ శాఖ  ద్వారా బంకులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు .ఖైదీలకు సత్ప్రవర్తన ముఖ్యమని ,జైలు శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు ఈ ప్రాంత వారికి ఇతర ప్రాంతాల వారికి కూడా నాణ్యమైన పెట్రోల్ డీజిల్ అందించి మెరుగైన సేవలు అందించాలని ,మంచి పేరు తేవాలని కలెక్టర్ పేర్కొన్నారు.

తప్పు చేసిన వారిని మంచి మార్గంలో నడపాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం అని సమాజం తీరుపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. జైల శాఖ ద్వారా పెట్టిన ఈ పెట్రోల్ బంకును ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ జైళ్ళ శాఖ ద్వారా నిర్మించిన ఈ పెట్రోల్ బంకులు ప్రజలు సపోర్ట్ చేయాలని బయట పెట్రోల్ బంకులలో జరుగుతున్న మోసాలపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయని కావున నాణ్యమైన కల్తీ లేని పెట్రోల్ డీజిల్ అందిస్తున్న జైళ్ళ శాఖ పెట్రోల్ బంకును ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పి సూచించారు.

అనంతరం జైల్లో ఖైదీలు తయారుచేసిన వివిధ వస్తువులను జైల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా జిల్లా కలెక్టర్ ఎస్పీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జైలు శాఖ ఐజి ఎన్ మురళి బాబు, ఎడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పి రాములు, ఇంజన్ ఆయిల్ డివిజిల్ రిటైల్ సేల్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ యస్ శ్రీకాంత్, జిల్లా సబ్ జైలు అధికారి ఆర్ శోభన్ బాబు, సూర్యాపేట సబ్ జైల్ సూపర్నెంట్ బి సుధాకర్ రెడ్డి ,అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇండోనేషియాతో భారత్ కు బలమైన బంధం ఉంది

Bhavani

‘నేను-తెలుగుదేశం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Satyam NEWS

లాండ్ సెల్లింగ్: ప్రభుత్వం చేసే ఘోర తప్పిదం ఇది

Satyam NEWS

Leave a Comment