31.2 C
Hyderabad
July 4, 2024 15: 41 PM
Slider గుంటూరు

అడ్డంగా దోచుకుతిన్న విడుదల రజని

#palanadudistrict

రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న జగన్ మోహన్ రెడ్డి బాటలో పయనించిన అప్పటి మంత్రి విడుదల రజని వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఆమె ప్రాతినిధ్యం వహించిన చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా యథేచ్ఛగా దోపిడి చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

పల్నాడు జిల్లా యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులను బెదిరించి ఐదు కోట్లు లంచం ఇవ్వాలని రజని పిఏ దొడ్డా రామకృష్ణ 2020 లో బెదిరిoచిన సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పిఏ రామకృష్ణ,మరిది గోపి  చెప్పింది వినాలని విజిలెన్స్ ఎస్పి జాషువా ఆ వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. చెప్పింది వినకపోతే 50 కోట్లు జరిమానా వేస్తామని పదే పదే బెదిరింపులు కూడా అధికారుల నుంచి వచ్చాయి. పిఏ రామకృష్ణ అక్రమ వసూళ్లకు అప్పటి విజిలెన్స్ ఎస్పి జాషువా పూర్తిగా సహకరించాడు.

తమ వద్ద అన్ని అనుమతి పత్రాలు ఉన్నాయని ప్రాధేయపడ్డా కూడా స్టోన్ క్రషర్ వ్యాపారులను వారు కనికరించలేదు. కరోనా వలన వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్ని  డబ్బులు ఇవ్వలేమని ఎస్పి జాషువాని వేడుకున్నా కూడా వ్యాపారులను వారు కనికరించలేదు. చివరికి 2కోట్ల 20 లక్షలకు రజని మరిది గోపి డీల్ సెటిల్ చేశాడు. 2021 ఏప్రిల్ లో  పిఏ దొడ్డా రామకృష్ణకి రెండు కోట్లు,రజని మరిది గోపి,ఎస్పి జాషువకి చెరో పది లక్షలు వ్యాపారులు ఇచ్చారు.

రాష్ట్రంలో అధికారం మారడంతో ఊపిరి పీల్చుకున్న యడ్లపాడు స్టోన్ క్రషర్ వ్యాపారులు తమకు న్యాయం చేయాలని పల్నాడు అడిషినల్ ఎస్పి లక్ష్మీపతికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రజిని మంత్రిగా ఉన్నప్పుడు పిఏ రామకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక సేటిల్మెంట్ లు చేశాడు. పసుమర్రు రైతులు కూడా వారం రోజుల క్రితం జిల్లా ఎస్పిని కలిసి తమ వద్ద ఐదు కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఫిర్యాదు చేశారు.

Related posts

యాక్టీవ్ గా లష్కరే తోయిబా..ఆప్ఘన్.. పాక్ లో శిబిరాలు

Sub Editor

శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్

Bhavani

కరోనా వ్యాప్తి అరికట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment