40.2 C
Hyderabad
April 29, 2024 16: 58 PM
Slider కడప

కరోనా వ్యాప్తి అరికట్టడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం

#BJPKadapa

కడప జిల్లా రాజంపేట లో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమంలో భాగంగా రాజంపేటలోని బిజెపి పట్టణ కార్యాలయంలో కో బిడ్ నిబంధనలను పాటిస్తూ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాజంపేట అసెంబ్లీ కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కరోనా వ్యాప్తిని అరికట్టడం లో వ్యాధి సోకిన వారికి చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు.

ఆంధ్ర రాష్ట్రం మొత్తం కోవిడ్-19 క్రియాశీల కేసులపరంగా జాతీయస్థాయిలో ఐదో స్థానం ఉందని మరణాల సంఖ్య లో జాతీయ స్థాయిలో తొమ్మిదో స్థానంలో మన రాష్ట్రం ఉందన్నారు.

ప్రైవేటు ఆస్పత్రిలో తాము అడ్మిట్ చేసుకున్న రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

అలాగే చికిత్స ధరలను నిర్ణయించిన ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్ వాటిని ఉల్లంఘించినప్పటికీ ప్రేక్షక పాత్ర గా చూస్తూ ఉండిపోయిందని విమర్శించారు.

రోగులకు పడకల అందుబాటులో లేవని పేర్కొంటూ చాలా జిల్లాల్లో రోగులు చేర్చుకోవడానికి ఆసుపత్రులు నిరాకరించాయని, కావున ఇప్పటికైనా కరోనా రోగులకు మెరుగైన చికిత్స కావలసిన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమానికి బిజెపి రాజంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి జీ.కే. నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్టుపోగుల ఆదినారాయణ, బిజెపి పట్టణ కార్యదర్శి రమణ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సూర్యచంద్ర తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

కారు,ఆర్టీసీ బస్సు ఢీ…నలుగురు మృతి

Bhavani

స్ట్రాటజీ: రాజంపేట ఎమ్మెల్యే తో సజ్జల భేటి

Satyam NEWS

కరోనా వైరస్ నివారణకు హోమియో మందు

Satyam NEWS

Leave a Comment