29.7 C
Hyderabad
July 3, 2024 15: 51 PM
Slider సంపాదకీయం

ఆంధ్రప్రదేశ్ లో ‘సంక్షేమం పండుగ’ ప్రారంభం

#chandrababu

సంక్షేమ పాలనకే కలికితురాయి. పేదరిక నిర్మూలనలో ఒక మైల్ స్టోన్. ప్రమాణ స్వీకారం నాడే మలి సంతకం పింఛన్ల పెంపుపై పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సింగిల్ స్ట్రోక్ లో పింఛన్ రూ. 1000 పెంపు ఒక విప్లవాత్మక నిర్ణయమైతే, తొలి కేబినెట్  లోనే దానికి ఆమోదం లభించింది.  పక్షం రోజుల్లోనే జీవో జారీ అయింది. ప్రభుత్వం ఏర్పడిన పాతిక రోజుల్లోనే దాన్ని అమలుచేశారు. తానే స్వయంగా ఇంటికి తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛను అందించడం నభూతో నభవిష్యత్ అని ఏపి ప్రజలు సంతోష పడుతున్నారు.

ఇన్నాళ్లూ వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ తన క్రెడిట్ అంటూ ఊదరగొట్టారు జగన్మోహన రెడ్డి. ఇప్పుడేకంగా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలే ఇంటింటికి వెళ్లి పెంచిన పింఛను పంపిణీ చేయడం నిజంగానే మిరకిల్. మొత్తం 65.18 లక్షల మంది పింఛన్లకు రూ 4,408కోట్లు ముందే విడుదల చేయడం నిజంగానే విశేషం. ప్రస్తుతం అందిస్తోన్న రూ 4వేల పింఛన్ లో తెలుగుదేశం ప్రభుత్వం పెంచిందే రూ 2,875.. అంటే 72% పెంచింది చంద్రబాబు, ఎన్టీఆర్ లే.

ప్రస్తుత పెంపుతో రూ 819కోట్ల భారం రాష్ట్రప్రభుత్వంపై పడినా వెనుకంజ వేయకుండా పింఛన్లు పెంచిన చంద్రబాబు ప్రభుత్వంపై అభినందనలు, హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. దివ్యాంగుల పింఛన్ 3వేల నుంచి 6వేలకు పెంచారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందిపడే రోగులకు రూ 5వేల నుంచి 10వేలకు, తలసేమియా, కిడ్నీ బాధితులకు 5వేల నుండి 10వేలకు పెంపు, కుష్టువ్యాధి వైకల్యానికి రూ 6వేలు..పక్షవాతం, తీవ్ర కండరాల లోపం ఉన్నవారికి 5వేల నుంచి 15వేలకు పెంచడం విశేషం.

ఎన్నికల సమయంలో వలంటీర్లతో పింఛన్ల పంపిణీని కేంద్ర ఎన్నికల సంఘం నిలిపేయమంది. ఇంటింటికీ పంపిణీ చేయమనే చెప్పింది.. కానీ ఈసీ ఆదేశాలను వక్రీకరించి ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది కల్గించేందుకు వృద్ధులను, దివ్యాంగులను, వితంతువులను మండుటెండల్లో బ్యాంకులవద్ద, సచివాలయాల వద్ద గంటల తరబడి నిలబెట్టి, రోజుల తరబడి తిప్పించి నరకం చూపించారు. తద్వారా తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత పెంచే పన్నాగం పన్నారు.

అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సెర్ప్ సీఈవో ధనుంజయ్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి నిర్వాకం కారణంగా 33మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ప్రభుత్వం మారింది, కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం నిజంగానే ఎడారిలో ఒయాసిస్ గా మారింది. పింఛన్ రూ 1000 చెయ్యడానికి జగన్మోహన రెడ్డి 4ఏళ్లు నానాపాట్లు పెడితే, చంద్రబాబు సీఎం అయిన తొలినెలలోనే రూ 1000పెంచడం పించనర్ల పాలిట పన్నీటి జల్లే..ఏ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీకి గత పాలకులు అడ్డుకట్ట వేశారో, అదే సిబ్బందిద్వారా ఇంటింటికీ పింఛన్లు 100% ఒక్కరోజులోనే పంపిణీ చేయించడం సీఎం చంద్రబాబు సమర్ధతకు నిదర్శనం.

మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లే తమ ఇంటికొచ్చి పెంచిన పింఛన్ రూ 4వేలకు మరో 3వేలు (ఏప్రిల్,మే, జూన్ 3నెలలకు 1000చొప్పున) మొత్తం రూ 7వేలు చేతిలో పెడితే వాళ్ల కళ్లల్లో ఆనందం అంతాఇంతా కాదు. 3 నెలల క్రితం ఫస్ట్ తారీఖుకు, ఇవాళ పస్ట్ తారీఖుకు ఎంత తేడా..? ప్రాణాలు తీసేవాడు పాలకుడు కాదు, ప్రాణాలు నిలబెట్టేవాడే పాలకుడు..ఆపదలు సృష్టించేది ప్రభుత్వం కాదు, ఆపదల్లో ఆదుకునేదే ప్రభుత్వం అనేది ఆచరించి చూపారు.

‘‘మీ భద్రత మా బాధ్యత..మీ ఆకాంక్షలను నెరవేర్చడమే మా తక్షణ కర్తవ్యమంటూ’’ చంద్రబాబు రాసిన బహిరంగ లేఖ రాష్ట్ర ప్రజలందరిలో ఎనలేని భరోసా నింపింది. భవిష్యత్ పై ధీమాను తెచ్చింది. ఇదే స్ఫూర్తి రాబోయే 5ఏళ్లలోనూ కొనసాగించాలని, పేదరికం లేని సమాజంగా రాష్ట్రాన్ని రూపొందించేందుకు ప్రతిఒక్కరూ పాటుబడాలని, అన్నివర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా ప్రజాప్రతినిధులంతా నిలబడాలని ఆశిద్దాం.

Related posts

Vijayanagaram Police: రెండున్నర గంటలు…45 ఫిర్యాదులు…

Satyam NEWS

జెర సోచాయించు తమ్మీ….

Satyam NEWS

వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికం

Satyam NEWS

Leave a Comment