29.7 C
Hyderabad
May 3, 2024 03: 45 AM
Slider కవి ప్రపంచం

జెర సోచాయించు తమ్మీ….

#purimalla new

అమాయకంగా నమ్మొద్దురా తమ్మీ! అని చెవునిల్లు గట్టుకొని జెప్పిన!
నరంలేని నాలిక
ఆడేవన్నీ అబద్ధాలురా అంటే ఇనుకోవైతివి!

ఫలానా ఆయన సత్తె హరిచ్చంద్రుడని
తెగ మెచ్చుకుంటివి
ఆ తర్వాత తెలిసిందిగా
గాయన సత్తేన్ని హరించే వాడని…

గీయన నిజంగా
మాట దప్పని బలి చక్రవర్తి లాంటోడని
బల్లగుద్ది మరీ చెప్పినవ్..
మాటనే బలిచ్చి మంచితనాన్ని వజపట్టే వాడని తెలిసిపోయిందిగా…

పనా అంచనా పొల్లుబోదని
పోయిన సారి
తెగ సంబర పడితివి గదా?

శిబి చక్రవర్తిని మించిన వాడని
గుండెల మీద చెయ్యేసి చెబితివి కదా..
తెలిసిందా! కండలు కోసి రక్షించే వాడు కాదు
గుండెలు తీసే బంటు లాంటి వాడని.
ఓ పిచ్చి తమ్మీ!
ఇది కలియుగం రా నాయినా!
కలియుగం
ధర్మం నడుములిరిగి ఐసియూలో
వైద్యం పొందుతున్న కలి యుగం..
ఇగ్గో తమ్మీ జెర సోచాయించు…

గీ దొంగ రాజకీయాలు, నాయకులు
వింత నాటకాలతో మభ్య పెడుతుంటే
నిజమని నమ్మావంటే
చెవుల్లో వాళ్ళు పెట్టేది ఏ కనకాంబరాలో కాదు క్యాబేజీ పూలు.
వాళ్ళను నమ్మకు తమ్మీ!
అసలైన నాయకుడెవరో
చేసేది కీడా మేలా?
మాటలకు చేతలకు పొంతనుందా!

కళ్ళకు మనసుకు దుర్భిణీలు అతికించుకుని
చూసి మరీ ఓటెయ్యి!

వురిమళ్ల సునంద ఖమ్మం

Related posts

పోలియో నిర్మూలన మనందరి బాధ్యత: ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS

సామాజిక దూరం పాటించి నిత్యావసర సరుకులు కొనాలి

Satyam NEWS

కరోనా బాధిత కుటుంబాల పిల్లల సంరక్షణ సహాయక కేంద్రం

Satyam NEWS

Leave a Comment