29.7 C
Hyderabad
April 29, 2024 08: 13 AM
Slider నల్గొండ

వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్షను భగ్నం చేయడం అప్రజాస్వామికం

#aderla

ఉద్యోగాలు రాక,ఉద్యోగ నోటిఫికేషన్లు లేక,చదువుకున్న చదువు వ్యర్థమై తల్లిదండ్రులకు భారం అవుతున్నామనే బాధతో తమ  ప్రాణాలను తీసుకుంటున్న నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల దీక్షను అడ్డుకోవడం అన్యాయమని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఉద్యోగాల కోసం ప్రాణాలు తీసుకోవద్దని యువతను కోరుతూ, ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్ తో ప్రతి మంగళవారం శాంతియుతంగా చేస్తున్న నిరుద్యోగ దీక్షను తెరాస ప్రభుత్వం భగ్నం చేయ్యడం, అక్రమ అరెస్టులు చేయ్యడం అప్రజాస్వామిక చర్య అని ఆయన అన్నారు. బుధవారం నాడు శ్రీనివాసరెడ్డి ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్వతంత్ర భారతదేశంలో ప్రతి మానవుడు తమ స్వేచ్ఛను ఒక హక్కుగా వినియోగించుకునే ఆవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు అమరులైన బాధిత కుటుంబాలకు అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్షను తమ పార్టీ నాయకురాలు షర్మిల చేసిందని తెలిపారు.

మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ లో రవీందర్ నాయక్ అనే నిరుద్యోగి గతంలో ఆత్మహత్యకు పాల్పడగా బాధిత కుటుంబాన్ని ఆమె పరామర్శించిన అనంతరం ఫీర్జాదిగూడ ఎగ్జిబిషన్ మైదానంలో శాంతియుతంగా నిరుద్యోగ దీక్షకు కూర్చోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చెయ్యడం ఏమిటని ప్రశ్నించారు.

దివంగత ముఖ్యమంత్రి కూతురు, ఒక మహిళ అనే గౌరవం కూడా లేకుండా నిస్సిగ్గుగా కెసిఆర్ ప్రభుత్వం చేసిన ఈ పనికి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కోట్లు కూడబెట్టిన కల్కీ అవతారం

Satyam NEWS

చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక

Satyam NEWS

పెంట్లవెల్లి లో సాంప్రదాయబద్దంగా పెద్ద దేవర్లు

Satyam NEWS

Leave a Comment