31.2 C
Hyderabad
July 4, 2024 21: 04 PM
Slider గుంటూరు

నిశ్శబ్ద విప్లవంలో జగన్ కొట్టుకుపోవడం ఖాయం

#varlaramaiah

సీఎం జగన్ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ నేతలు ఈసీని కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ…మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది, ఆ నిశ్శబ్ద విప్లవంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డి కొట్టుకుని పోతున్నాడు.

పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే సీఈసీ ఎలాంటి చర్యలు  తీసుకోలేదు. పోలింగ్ బూత్ 202లో పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేశాడు  అక్కడ వీవీ ఫ్యాట్ స్లిప్‌లు బయటపడ్డాయి,  అందులో 6 ఓట్లు వైసీపీకి.. 22 ఓట్లు టీడీపీకి పడ్డాయి. అవి చూసి పిన్నెల్లికి పిచ్చెక్కింది. మాచర్లలో నిశ్శబ్ద విప్లవం వచ్చింది,  పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మాచర్లలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అక్కడ రాజ్యాంగ పాలన లేదు. ఈ ఎమ్మెల్యే మాకొద్దని ప్రజలు నిర్భయంగా ఓట్లు వేశారు.మాచర్లలో  మొదలైన నిశ్శబ్ద విప్లవం  విప్లవం రాష్ట్రంలోని మిగతా 174 నియోజకవర్గాల్లోనూ వచ్చింది.ఆ నిశ్శబ్ద విప్లవంలో జగన్  అరాచక పాలన కొట్టుకొని పోవడం ఖాయం. జగన్ నిర్మించుకున్న అవినీతి, నేర సామ్రాజ్యాన్ని ప్రజలు కూల్చివేశారు.

అల్లర్లు సృష్టించి సజావుగా కౌంటింగ్ జరగకుండా ఉండేందుకు ఏజెంట్లను కిడ్నాప్ చేసి గందరగోళం సృష్టించేందుకు సజ్జల కుట్ర పన్నారు. ఇక వైసిపి కుట్రలు చెల్లవు. రాష్ట్రంలో వైసీపీ దుకాణం బంద్ అయింది,  పోలీసులు వైసిపి నేతల మాట వినే పరిస్థితిలో  లేరు.  ఇకనైనా సజ్జల రామకృష్ణారెడ్డి, డిజిపి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు సహకరించాలి, నాడే 32 చోట్ల రీపోలింగ్ కోరాం

సజ్జల అవగాహన రాహిత్యంగా మాట్లాడటం మానుకోవాలి. ఓడిపోతున్నామన్న నిరాశ నిస్పృహలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఓడిపోతున్నామని తెలిసి చాలామంది వైసిపి నేతలు ఇళ్లకే పరిమితమయ్యారు. వై నాట్ 175 అన్న పెద్దలు కనీసం డిపాజిట్లు అయినా దక్కుతాయా అని ఆందోళన చెందుతున్నారు. మరి కొంతమంది ప్రతిపక్ష హోదా అయినా అన్న దక్కుతుందా అని ఆందోళనలో ఉన్నారు. వైసీపీ కార్యాలయాలు చిన్నబోయి ఒకరిద్దరూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంటున్నారు. వైసిపి కేల్ ఖతం అయిందని ఆ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమైంది.

పోలింగ్ ఏజెంట్లుగా ఉండటానికి కూడా ఆ పార్టీకి కార్యకర్తలు కరువయ్యారు. పోలీసులు కూడా వారి మాట వినడం లేదు, మాకెందుకు వచ్చిన గొడవ  చట్టం ప్రకారం పని చేస్తామని పోలీసులు బదులిస్తున్నారు. ఈ నిశ్శబ్ద విప్లవం ప్రభావం జూన్ 4 ఉదయం 10 గంటలకు భగ్గుమంటుందని వర్ల అన్నారు.ఈసిని కలిసిన వారిలో మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథ్ రెడ్డి.మాజీ ఎమ్మెల్సీ  ఏఎస్ రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి  సుధాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి, టీడీపీ నేతలు  మన్నవ సుబ్బారావు,  ఎస్పీ సాహెబ్, కోడూరి అఖిల్ తదితరులు ఉన్నారు.

Related posts

మేజర్ పోర్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

Satyam NEWS

9న మెట్రో కు శంఖుస్థాపన

Murali Krishna

నిత్యం కొత్తగా ఆలోచిస్తేనే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందుతాయి

Satyam NEWS

Leave a Comment