35.2 C
Hyderabad
May 1, 2024 01: 23 AM
Slider విశాఖపట్నం

మేజర్ పోర్టు క్రికెట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం

cricket torny

ఆల్ ఇండియా మేజర్ పోర్ట్ స్పోర్స్ట్ కంట్రోల్ బోర్డ్ పర్యవేణలో  39వ అల్ ఇండియా మేజర్ పోర్ట్ క్రికెట్ చాంపియన్ షిప్ 2019-2020 ని విశాఖపట్నం పోర్టు ట్రస్టు నిర్వహిస్తోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ కె. రామమోహనరావు ఐఏఎస్ పోర్టు డైమండ్ జూబ్లీ అవుడ్ డోర్ ( క్రికెట్) స్టేడియంలో నేడు ఛాంపియన్ షిప్ ను ప్రారంభించారు.

పోర్టు డిప్యూటీ చైర్మన్ పిఎల్ హరనాధ్, సెక్రటరీ శ్రీ హరిచంద్రన్, శివకుమార్ పోర్టు చీఫ్ అంకౌంట్స్ అఫీసర్ ఇంచార్జ్, పోర్టు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పది మేజర్ పోర్టులకు సంబంధించిన క్రికెట్ టీమ్ లు పాల్గొన్నారు. చైర్మన్ రామమోహనరావు ఛాంపియన్ షిప్ జెండాను ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం వివిధ పోర్టుల నుంచి వచ్చిన క్రికెట్ జట్టు సభ్యులను పోర్టు చైర్మన్ పరిచయం చేసుకున్నారు. అనంతరం చైర్మన్, డెప్యూటీ చైర్మన్ లు సరదాగా అది మాచ్ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామమోహనరావు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఆందోళనలను దూరం చేస్తాయని, ఇటువంటి క్రీడల వల్ల ఒక ప్రాంతం గురించి ఇతర ప్రాంతాల వారు తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.

ఆటలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడాకారులకు, క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని చైర్మన్ అన్నారు. గెలుపు ఆనందాన్ని ఇస్తుందని ఓటమి గెలుపుకు స్ఫూర్తి ఇస్తుందని చైర్మన్ వెల్లడించారు. ఇక మ్యాచ్ లన్నీ టి20 ఫార్మాట్ లో నేటి  నుంచి 6 వ తేదీ వరకూ, ఐదు రోజుల పాటు జరుగుతాయి.

విశాఖపట్నం పోర్టు డైమండ్ జూబ్లీ స్టేడియం తోపాటు రైల్వే స్టేడియంలలో ఈ మ్యాచ్ లను ఉదయం సాయంత్రం నిర్వహించనున్నారు. సేమీ ఫైనల్స్ రెండు మ్యాచ్ లు, ఫైనల్ మ్యాచ్ ను పోర్టు స్టేడియంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 6వ తేదీన ఆల్ ఇండియా మేజర్ పోర్ట్స్ క్రికెట్ చాంపియన్ షిప్  ముగింపు ‌వేడుకలను పోర్టు స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ చాంఫియన్ షిప్ లో 1. ముంబై పోర్టు ట్రస్టు, 2. కోల్ కతా పోర్ట్ ట్రస్టు, 3. దీన్ దయాళ్ పోర్టు ట్రస్టు, 4. ట్యూటీకోరిన్ పోర్టు ట్రస్టు,  5. పారాదీప్ పోర్టు ట్రస్టు, 6. జవహర్ లాల్ నెహ్రూ పోర్టు ట్రస్టు, 7. చెన్నై పోర్టు ట్రస్టు, 8. న్యూ మంగుళూరు పోర్టు ట్రస్టు, 9. కొచ్చిన్ పోర్టు ట్రస్టు, 10. విశాఖపట్నం పోర్టు ట్రస్టు (హోస్టింగ్) లు పాల్గొంటున్నాయి. మొదటి మ్యాచ్ విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ , చెన్నై పోర్టు ల నడుమ పోర్టు స్టేడియం లో నిర్వహించారు.   

Related posts

వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి

Satyam NEWS

ప్రయివేటు బస్సు బోల్తా: ఐదుగురికి గాయాలు

Satyam NEWS

నిరసన తెలిపే వారిని తుపాకితో బెదిరిస్తారా?

Satyam NEWS

Leave a Comment