32.7 C
Hyderabad
April 27, 2024 01: 42 AM
Slider శ్రీకాకుళం

నిత్యం కొత్తగా ఆలోచిస్తేనే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందుతాయి

#jdlaxminarayana

విద్యార్థులు నిత్యం కొత్తగా ఆలోచిస్తేనే శాస్త్రీయ ఆలోచనలు పెంపొందెందుకు, భవిష్యత్తులో శాస్త్ర వేత్తలుగా ఎదిగేందుకు అవకాశం కలుగుతుంది అని సీ బీ ఐ పూర్వ జేడి వి.వి. లక్ష్మి నారాయణ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ లో లో శనివారం సాయంత్రం జరిగిన మెగా సైన్స్ ఫెయిర్ విజేతల బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

విద్యార్థులు ప్రతి విషయంలోనూ ఏమిటి.. ఎందుకు.. ఎలా అని ప్రశ్నలు వేసుకుంటూ వాటికి సమాధానాలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలని సూచించారు. సమాజంలో సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. ప్రతి రోజు ఫజిల్స్ చేదించడం విద్యార్థుల మెదడు ఉత్తేజం అవుతుంది అని, తద్వారా కొత్త విషయాలు కనుగొనే వీలు కలుగుతుంది అన్నారు. తల్లి తండ్రులు తమ కలలను పిల్లల మీద  రుద్దకూడదని, పిల్లల కలలను సాకారం చేసే దిశగా తోడ్పాటు అందించాలని హితవు పలికారు.

తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు కలసి పనిచేస్తేనే మంచి పౌరులు తయారు కాగలరని సూచించారు. మీ సంతకం ఆటోగ్రాఫ్ అయ్యే స్థాయికి, నువ్వు చదివిన స్కూల్ కు గెస్ట్ గా వెళ్ళే స్థాయికి చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. అనంతరం విజేతలకు జిల్లా విద్యా శాఖాధికారి జి. పగడాలమ్మ తో కలసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ లావణ్య రాణీ, సైన్స్ ఫెయిర్ ఇంఛార్జి సౌజన్య, ఉపాధ్యాయులు దేవి, మణికంఠ, నీరోషా, అనూష, లత, జేమీమా, రోజారాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల వేళ విపక్షాలు ఏకమయ్యేనా?

Satyam NEWS

యాసంగి వడ్లను పూర్తిగా కేంద్రమే కొనాలి

Satyam NEWS

ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ కుంభకోణం?

Satyam NEWS

Leave a Comment