31.2 C
Hyderabad
July 4, 2024 15: 46 PM
Slider నిజామాబాద్

అప్రకటిత విద్యుత్ కోతలు నిరసిస్తూ సబ్ స్టేషన్ ముట్టడి.

power

కరెంటు కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామస్తులు రైతులు స్థానిక సబ్ స్టేషన్ ముట్టడించారు కొంతకాలంగా విద్యుత్ సమస్యలు వేధిస్తున్నాయని అయినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు కూడా ఉండడంతో గృహోపకరణాలు కూడా పాడవుతున్నాయని పలువురు వాపోతున్నారు. తరచూ కరెంటు వస్తూ పోతూ ఉండడంతో ఇండ్లలో టీవీలు,రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర విద్యుత్ వస్తువులు చెడిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి వ్యక్తం చేసిన పెడచెవులో పెడుతున్నారని అందువల్ల విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా హెచ్చుతగ్గులు తగ్గించి అప్రకటిత విద్యుత్ కోతలు తగ్గించాలని అధికారులను కోరారు.

Related posts

తిరుపతి ఫొటోగ్రాఫర్స్ సంఘానికి నూతన కార్యవర్గం

Satyam NEWS

ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించండి

Satyam NEWS

ముదిరాజ్ లకు ప్రాధాన్యతనివ్వని తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment