30.7 C
Hyderabad
July 2, 2024 14: 27 PM
Slider తెలంగాణ

వరంగల్ నగరాభివృద్ధికి సత్వర చర్యల

revanth

తొలుత వరంగల్ నగరంలోని టెక్స్‌టైల్ పార్క్‌లో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత టెక్స్‌టైల్ పార్క్‌ను పరిశీలించి ఉన్నతాధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం నగరంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. నిర్ధేశిత గడువులోగా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాలని, నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, మళ్లీ 45 రోజుల్లో మరో సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు.చివరలో నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికవర్ హాస్పిటిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడి హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి వారికి ప్రత్యేక కార్డులు జారీ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు.

Related posts

జగిత్యాల డిఎస్పి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం

Satyam NEWS

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

Satyam NEWS

పల్లె ప్రగతిలో విద్యుత్ శాఖ మెరుపులు

Satyam NEWS

Leave a Comment