38.2 C
Hyderabad
April 29, 2024 13: 04 PM
Slider కృష్ణ

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

#VijayawadaPolice

విజయవాడ కమిషనరేట్ పరిధిలో 200 పైగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని అందువల్ల ఎవరూ బయటకు రావద్దని డిసీపీ విక్రాంత్ పాటిల్ విజయవాడ ప్రజలను కోరారు. నేడు ఆయన రెడ్ జోన్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.

డాబా కోట్ల సెంటర్ రెడ్ జోన్ లో పోలీస్ వాహనాలతో మార్చ్ పాస్ట్ నిర్వహించిన పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీస్ మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించిన డిసీపీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ రెడ్ జోన్ ప్రాంత ప్రజలకు నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నాం మని అందువల్ల ప్రజలు బయటకి రావద్దని కోరారు.

నగరంలో బాధ్యతారహితంగా ఉన్న వారి వల్ల కరోనా వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ లో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయని అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని కోరారు. ఎవరూ బయటకు రాకూడదు.. ఇష్టం వచ్చినట్లు వస్తే ఊరుకోం. కరోనా కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయి అని ఆయన హెచ్చరించారు.

Related posts

బీరు బాటిళ్లు, విస్కీ సీసాలతో సాయిబాబాకు అభిషేకం

Satyam NEWS

స్థానిక సంస్థల గ్రాంటుగా తెలంగాణకు రూ.222 కోట్లు

Sub Editor

యూనియన్ బ్యాంక్ తాలూకా లోన్ మేళా

Satyam NEWS

Leave a Comment