Slider రంగారెడ్డి

గుడిసె వాసులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ హామీ

#revanthreddy

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో సిపిఐ ఆధ్వర్యంలో భూదాన భూమిలో 8వేల గుడిసెలు వేసుకున్న వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి,రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి  పర్వతాలు, ముత్యాల యాదిరెడ్డి కలిశారు.

సంవత్సరం ఆరు నెలలుగా ఎండ వాన అని లెక్క చేయకుండా చిన్నపిల్లలతో నిరుపేద ప్రజలు అక్కడ జీవిస్తున్నారని, ఆ గుడిసెల్లో నివసించే ప్రజలందరూ చిన్న మధ్య తరగతి వర్గాలకు చెందినటువంటి ప్రజలని తెలిపారు. దాదాపు 400 మంది విద్యార్థులు అక్కడినుంచే స్కూల్స్కు వెళ్తున్నారు. భూదాన భూమి పేదలకే చెందే విధంగా చూడాలని, మౌలిక సదుపాయాలైన కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో రెవిన్యూ పోలీస్ అధికారులు కుమ్మక్కయి 13-06-2024 గుడిసెలను తొలగించే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గుడిసె వాసులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సిపిఐ నాయకులు తెలిపారు.

Related posts

ఉరే సరి: పూణెలో ఉగాండా మహిళపై గ్యాంగ్ రేప్

Satyam NEWS

కల్తీ నూనెల తయారీదారులపై ఉక్కుపాదం మోపాలి

Satyam NEWS

KCR U Turn: నూతన వ్యవసాయ చట్టానికి కొత్త ఊతం

Satyam NEWS

Leave a Comment