24.7 C
Hyderabad
July 6, 2024 00: 20 AM
Slider ముఖ్యంశాలు

హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్ కు ఎదురుదెబ్బ

#KCR

తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విద్యుత్ అవకతవకలపై జ్యుడిషియరీ కమిషన్ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టులో కేసీఆర్ సవాల్ చేశారు. నేడు కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. ఇరువైపుల వాదనలూ విన్న న్యాయస్థానం ప్రభుత్వ వాదనలను సమర్థిస్తూ కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది.హైకోర్టులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై మూడు రోజుల ముందే వాద‌న‌లు ముగిశాయి.

అయితే ఆ రోజున హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జ‌స్టిస్ ఎల్ న‌ర‌సింహారెడ్డి జారీ చేసిన నోటీసులు ర‌ద్దు చేయాల‌ని కేసీఆర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అసలు కేసీఆర్ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాద‌న‌లు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డి నేతృత్వంలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ సంఘాన్ని నియమించింది. కమిషన్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని ఇవాళ హైకోర్టు కొట్టివేసింది.

Related posts

తోటమాలి

Satyam NEWS

కర్రలతో పాటు 500 ట్రాక్ కెమెరాలు

Bhavani

వివేకా హత్య కేసు దర్యాప్తులో తాత్కాలిక విరామం

Satyam NEWS

Leave a Comment