29.2 C
Hyderabad
June 30, 2024 19: 51 PM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రం పోలీస్ బాస్ కు స్థాన చ‌ల‌నం త‌ప్ప‌దా?

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ బాస్ ..ఎస్పీ దీపిక ఎం పాటిల్ కు స్థాన చ‌ల‌నం త‌ప్ప‌దా..? బాస్ గా స‌రిగ్గా ఈ నెల‌లో అనుకుంట బాధ్య‌త‌లు స్వీక‌రించి…మూడేళ్లు అవుతోంది. ఎస్పీగా దీపిక ఎం పాటిల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌న ఆమె హాయాంలోనే… స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు…ఆపై జెడ్పీ ఎన్నిక‌లు…తాజాగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు. జ‌రిగిన మూడు ఎన్నిక‌ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా నిర్వ‌హించినా….నిండు చంద్రుడికో నూలు పోగు అన్న‌ట్టు…ఎస్పీగా వ‌చ్చిన కొత్త‌లోనే పోలీస్ బ్యారెక్స్ లో..ఏఆర్ విభాగానికి చెందిన ఆర్ ఎస్ఐ ఈశ్వ‌ర‌రావు…ఆత్మ‌హత్య ..పోలీస్ శాఖలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

స్వ‌యంగా ఈశ్వ‌ర‌రావు భార్య‌…పోలీస్ శాఖ అందున ఉన్న‌తాధికారు ఒత్తిళ్ల‌తోనే..ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని విలేక‌రుల ముందు చెప్ప‌డంతో పోలీస్ శాఖ  కే ఓ స‌వాల్ గా మారింది. ఆ స‌మ‌యంలోనే..ఎస్పీ దీపిక‌…సుదీర్ఘ స్థాయిలో శాఖా ప‌రంగా…డీఐజీ ఉత్త‌ర్వులతో శాఖా ప‌ర‌మైన విచార‌ణ జ‌రిపించారు కూడ‌. దీంతో..ఏఆర్ విభాగంలో…ఉన్న పలు సంక్షేమ ప‌ధ‌కాల ద్వారా…సొమ్ము వాడటంతో పాటు..ఫేర్లు పెట్ట‌డం..చిట్టీల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం…దీనికి తోడు శాఖా ప‌రంగా డ్యూటీలు వేయ‌డం ద‌ర‌మిలా వచ్చిన ఒత్తిళ్లతో పాటు కుటుంబంలో అల్ల‌ర్లు చెల‌రేగడంతో..మాన‌సికంగా కృంగిన ఆర్ఎస్ఐ…క్ష‌ణికావేశంలో నిర్ణ‌యం తీసుకుని…క‌డుపున పుట్టిన ఇద్ద‌రు చంటిపిల్ల‌ల‌కు అల్లంత దూరంగా వెళ్లిపోయాడు.

ఈ సంఘటన…ఎస్పీగా ఉన్న దీపిక స‌మ‌యంలో జ‌ర‌గ‌డంతో…ఆమె చేప‌ట్టిన ప‌ద‌వితో పాటు.. ..శాఖ‌కే మ‌చ్చ గా మిగిలిపోయింది. అయితే త‌ద‌నంత‌రం…శాఖ‌లో వ‌చ్చిన ఎన్నిక‌ల‌లో స‌మ‌ర్ధ‌వంతంగా విధులు నిర్వ‌హించిన కార‌ణంగా..మంచి పేరు తెచ్చుకున్నారు….ఎప్పీ దీపిక‌. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్తి కావవడం…ఆ పై ఎస్పీగా దీపిక బాధ్య‌తలు చేప‌ట్టి మూడేళ్లు దాటడంతో…ఇక ఎస్పీకి స్థాన చ‌ల‌నం త‌ప్ప‌ద‌న్న ఊహాగానాలు..పోలీస్ బ్యారెక్స్ వ‌ద్ద చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

కొద్ది నెల‌ల క్రితం…కేంద్ర హోం మంత్రి అమిత్ షా…హైద‌రాబాద్ రావ‌డంతో….విజ‌య‌న‌గ‌రం ఎస్పీ దీపిక‌,పార్వ‌తీపురం ఎస్పీ విక్రాంత్ పాఠిల్ లు…ఇద్ద‌రూ ఆయ‌నను క‌లిసి….బ‌దిలీ గురించి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఇక ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో….ఎట్ట‌కేల‌కు ఎస్పీ దంప‌తుల‌కు బ‌దిలీ జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

హైదరాబాద్ లో ఇక కంటైన్ మెంట్ జోన్ల ఏర్పాటు

Satyam NEWS

యాసంగి వరి ధాన్యం కొనాల్సిందే : జుక్కల్ ఎమ్మెల్యే షిండే

Satyam NEWS

నేరచరితులకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇస్తే ఎలా?

Satyam NEWS

Leave a Comment