39.2 C
Hyderabad
May 3, 2024 11: 23 AM
Slider తూర్పుగోదావరి

రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలిద్దాం రండి

#raghu

డ్రగ్ ఆంధ్ర ప్రదేశ్, రుణ ఆంధ్ర ప్రదేశ్  అని ఉన్న బ్యాడ్ ఇమేజ్  నుంచి రాష్ట్రం బయటపడాలంటే  తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారథ్యం  రాష్ట్రానికి ఎంతో అవసరమని నరసాపురం ఎంపీ, తెదేపా నాయకులు  రఘురామకృష్ణం రాజు అన్నారు. జనసేన సహకారంతో రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడం జరుగుతుందన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను కలిసిన అనంతరం రఘురామకృష్ణం రాజు  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అరాచకం చేస్తున్న వ్యక్తిని ఇంటికి పంపాలంటే, మూడు పార్టీల కలయిక  ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆ మూడు పార్టీలను ఏకం చేయడానికి  పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేశారని తెలిపారు. ఇప్పుడు మరింత చొరవ తీసుకొని, రాష్ట్రంలో విస్తృతంగా ప్రచార సభలను నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు.   పవన్ కళ్యాణ్ ను పవిత్రమైన ఉగాది పండుగ రోజు కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా  పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం  నుంచి  పవన్ కళ్యాణ్ 65 వేల కు పైచిలుకు  మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని  రఘురామకృష్ణం రాజు ధీమా వ్యక్తం చేశారు. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా ఎక్కువ మెజారిటీ తోనే ఆయన విజయం సాధిస్తారని తెలిపారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బసచేసి కుర్చీ వేసుకుని కూర్చుని  ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

నేను లోక్ సభ కు పోటీ చేస్తానా?, అసెంబ్లీకి పోటీ చేస్తానా? అన్న దానిపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని వెల్లడించారు. చంద్రబాబు నాయుడుతో సహా  పలువురుపై  తప్పుడు కేసులు నమోదు  పోలీస్ అధికారి కొల్లి రఘురాంరెడ్డిని  ఎన్నికల సంఘం అస్సాం కు బదిలీ చేసిందని, తప్పు చేసిన  ప్రతి అధికారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా తప్పులు చేసిన అధికారులను ఉద్దేశించి  పాపులు శిక్షించబడుదురని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవాళ ఒక అధికారిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం, త్వరలోనే మరికొంతమందిని  బదిలీ చేయడం ఖాయమన్నారు. సిఐడి అధికారులు  పేపర్లను దగ్ధం చేసిన విషయాన్ని  మీడియా పత్రినిధులు  రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ… జిరాక్స్ సరిగా రాని పేపర్లను మాత్రమే దగ్ధం చేశామని, పోలీసు అధికారులు చిన్నపిల్లల కబుర్లు చెబుతున్నారని, ఒక హెరిటేజ్ కంపెనీకి సంబంధించిన పేపర్లు మాత్రమే సరిగ్గా జిరాక్స్ రాలేదా అంటూ ఎద్దేవా చేశారు.

చిరంజీవితో ఎంతో స్నేహం… పవన్ కళ్యాణ్ తో అంతే సాన్నిహిత్యం

మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో తనకు ఎంతో స్నేహం ఉందని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో అంతే సాన్నిహిత్యం ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రానున్న ఎన్నికల్లో నేను ఎక్కడ పోటీ చేసిన నా విజయానికి ప్రచారం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ను కోరానని  ఆయన తెలిపారు.

దానికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. తప్పకుండా మీ విజయానికి అండగా ఉంటానని  హామీ ఇచ్చారని  వివరించారు. నా విజయానికి అండగా ఉంటానని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు  ఎంతో రుణపడి ఉంటానని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నిన్న, మొన్నటి వరకు  నాకు ఎవరూ లేరని సాక్షి దినపత్రిక, జగన్మోహన్ రెడ్డి అన్నారని గుర్తుచేసిన రఘురామ కృష్ణంరాజు ఇవాళ నాకు తెలుగుదేశం పార్టీతో పాటు, ఇంతమంది జనసైనికులు ఉన్నారని, ఇక నాకేంటి భయం అని  ప్రశ్నించారు.

చట్టసభలకు ఎన్నికవుతా… ప్రజాక్షేత్రంలో ఉంటా

రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామ కృష్ణంరాజు మరోసారి పునరుద్ఘాటించారు. అసెంబ్లీకి, లోక్ సభ కు  పోటీ అంశంపై  మరో 48 గంటల్లో  స్పష్టత రానున్నదని వెల్లడించారు. ఇన్ని రోజులపాటు వేచి చూశారు…  మరో 48 గంటల పాటు ఓపిక పట్టాలని  ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్లు  టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయాన్ని రఘురామకృష్ణంరాజు దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకురాగా, నాతోపాటు అందరికీ ఒకేసారి న్యాయం జరుగుతుందేమోనని ఆయన చమత్కరించారు.

Related posts

సత్యంన్యూస్ ఎఫెక్ట్ :పాతకాపుల ఉద్వాసనకు కొత్త నిర్ణయం

Satyam NEWS

పేదరికం నిర్మూలనే టీడీపీ ధ్యేయం

Satyam NEWS

President election: ఫలితం ముందే తెలిసిన పోరాటం

Satyam NEWS

Leave a Comment