27.7 C
Hyderabad
May 15, 2024 03: 12 AM
Slider నిజామాబాద్

యాసంగి వరి ధాన్యం కొనాల్సిందే : జుక్కల్ ఎమ్మెల్యే షిండే

యాసంగి వరి ధాన్యం ను కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని కామారెడ్డి జిల్లా జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని నిజాంసాగర్, బిచ్కుంద ,జుక్కల్, మద్నూర్ ,పిట్లం, పెద్దకొడప్గల్ మండలాల్లో రైతు నిరసన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే నిజాంసాగర్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చిన్నచూపు చూస్తుందని ఇది సమంజసం కాదన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు,ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి,బిచ్కుంద లో ఎంపీపీ అశోక్ పటేల్, తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, సొసైటీ చైర్మన్ బాలాజీ(బాలు), మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు శ్రీహరి,మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్,జుక్కల్లో ఎంపీపీ యశోద నీలు పటేల్,తెరాస అధ్యక్షులు మాధవరావు దేశాయ్ ,బొల్లి గంగాధర్,మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్,మద్నూరులో తెరాస అధ్యక్షులు సంగమేశ్వర్ , ఎంపీపీ లక్ష్మీబాయ్,జడ్పీటీసీ అనిత,చిత్రంలో ఎంపిపి కవిత విజయ్, జడ్పిటిసి శ్రీనివాస్రెడ్డి ,పెద్ద కొడప్గల్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి తెరాస శ్రేణులతోపాటు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తెరాస శ్రేణులు పాల్గొన్నారు.

జీ లాలయ్య, సత్యం న్యూస్ జుక్కల్

Related posts

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ

Bhavani

10 న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నామినేషన్

Satyam NEWS

Leave a Comment