29.2 C
Hyderabad
June 30, 2024 19: 50 PM
Slider గుంటూరు

పిన్నెల్లి బ్రదర్స్ అరాచకాలు అన్నీఇన్నీ కావు

#chandrababu

మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం, కండ్లగుంట గ్రామానికి చెందిన నోముల మాణిక్యాలరావుతో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. ఎన్నికల రోజున కండ్లగుంటలో 114వ బూత్ లో ఏజంట్ గా నోముల మాణిక్యాలరావు కూర్చున్నారు. ఆ సమయంలో రిగ్గింగ్ కోసం బూత్ లోకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకట్రామిరెడ్డి వెళ్లాడు. వెంకట్రామిరెడ్డి రిగ్గింగ్ కు పాల్పడటంతో నోముల మాణిక్యాలరావు అడ్డుకున్నారు. దీంతో తన అనుచరులతో కలిసి వెళ్లి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై వెంకట్రామిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. అనంతరం పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి నిన్ను కూడా చంపేస్తామని దళితుడైన మాణిక్యాలరావును వెంకట్రామిరెడ్డి బెదిరించాడు. ప్రాణభయంతో మాణిక్యాలరావు ప్రస్తుతం హైదరాబాద్ లో తలదాచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మాణిక్యాలరావుతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

Related posts

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

Murali Krishna

కావలి పి జి సెంటర్ లో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

Bhavani

జీహెచ్ఎంసీ భారీగా నామినేష‌న్లు

Sub Editor

Leave a Comment