34.7 C
Hyderabad
May 5, 2024 02: 01 AM
Slider నెల్లూరు

కావలి పి జి సెంటర్ లో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి

#Kavali PG Center

కావలి పట్టణం లోని విక్రమ సింహపురి విశ్వవిద్యా లయ కళాశాలలో గురువారం శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచర్యులు మరియు గణిత శాఖ ప్రధానాచార్యులు ఆచార్య శ్రీనివాస రావు గారు పాల్గొని ప్రసంగిస్తూ గణితము దైనందిన జీవితం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని, మనిషి జీవితము గణితం తోనే ముడిపడి ఉందని,

అలాగే చిన్నతనం నుండే గణితం పట్ల ఆసక్తి ని, అభిరుచిని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భం గా అధ్యాపకులు ప్రసంగిస్తూ ఆయన జీవితచరిత్రను, ఆయన గణితానికి చేసిన కృషిని వివరిస్తూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా॥ బి. వెంకటేశ్వర్లు, డా॥ భరతకుమార్, శ్రీ ప్రసార రావు గారు, శ్రీలలిత జ్యోతి గారు అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Related posts

బిఆర్ఎస్ కు బుల్లెట్ దిగింది: మెగారెడ్డి                                                                            

Satyam NEWS

మతపరమైన కార్యక్రమాలను నిరోధించే అధికారం ప్రభుత్వానికి లేదు

Satyam NEWS

కేసీఆర్, రేవంత్ రెడ్డి గెలిస్తే లోకల్ గా ఉండలేరు

Satyam NEWS

Leave a Comment