29.2 C
Hyderabad
June 30, 2024 19: 18 PM
Slider గుంటూరు

డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ దోపిడి

#sajjala

ఏపి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఒకే ఒక్క ఏడాదిలో రూ.1800 కోట్లకుపైగా ప్రజాధనాన్ని జగన్ రెడ్డి దోచుకున్నారు. తన సొంత ప్రచారం కోసం మనుషుల్ని పెట్టుకుని వారికి జీతాల పేరుతో జగన్ రెడ్డి చేసిన అక్రమం ఇది. సజ్జల భార్గవ్‌ రెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్‌ మీడియా విభాగం, వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ‘ఐ ప్యాక్‌’ ఖర్చు మొత్తం ఈ ఖర్చుతోనే నడిచాయి. 2018-19లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం ఖర్చు రూ.864కోట్లు. అదే జగన్‌ హయాంలో చివరి ఏడాది 2023-24లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం ఖర్చు ఏకంగా రూ.2861 కోట్లకు చేరింది.

అంటే… మూడింతలకు మించి పెరిగింది. టీడీపీ, జనసేన నేతలు, సానుభూతిపరులపై అసభ్యకర పోస్టింగులు పెట్టడమే ఈ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జీతాలు తీసుకున్నవారు చేసినపని. జగన్ రాజ్యంలో డిజిటల్‌ మీడియా కార్పొరేషన్‌ అనేది మాయా ప్రపంచం. ఎంతమంది, ఎక్కడ ఏం పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా ఆఫీసుకు రానివాళ్లు, భార్యాభర్తలు, వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర బడ్డీ కొట్టు నడిపే వాళ్లూ ఇందులో ఉద్యోగులే! జగన్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు విష వ్యూహాలు రచించిన ఐప్యాక్‌ సంస్థకు వందల కోట్లు చెల్లించారు.

ఈ డబ్బంతా ప్రజలు కట్టిన పన్నుల నుంచి చెల్లించిన సొమ్మే. రెండేళ్ల క్రితం ఐప్యాక్‌ ఉద్యోగులందరినీ సజ్జల భార్గవ్‌ ఆఫీసుకు తరలించారు. వీరందరికీ ఔట్‌ సోర్సింగ్‌ పద్దు నుంచే జీతాలు చెల్లించారు. ఏపీసీఎ్‌ఫఎస్‌ఎ్‌సలో(ఏపీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌) పేరిట మరో సంస్థను ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 400 మందిని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా కూర్చోబెట్టారు. ఇక సజ్జల భార్గవ్‌ తన సోషల్‌ మీడియా కార్యాలయాన్ని విజయవాడలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ భవనంలో నిర్వహించారు.

వందల కొద్దీ ఉద్యోగులను చేర్చుకున్నారు. వీరి జీతాలు ఖజానా నుంచే చెల్లించారు. జడ్జిలపై దూషణ కేసులో అరెస్టైన 11 మంది డిజిటల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వమే కోర్టు ఖర్చులు భరించింది. కేసుల నుంచి బయటకు వచ్చాక వారందరికీ ప్రమోషన్లు కల్పించి లక్షల్లో జీతం ఇచ్చింది. ఇందులో ఒక మహిళా ఉద్యోగిని ఏకంగా డిజిటల్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమించి నెలకు రూ.2.5 లక్షల జీతం ఇచ్చారు.

ఇదంతా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల పద్దు నుంచి వెళ్లినవే. అలాగే, ఏపీ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌లో కూడా వందల సంఖ్యలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకున్నారు. జగన్‌ హయాంలో ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకం ఒక్కటీ జరగలేదు. అప్పటికే ఉన్న వారందరినీ ఒక్క కార్పొరేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చి దానికి ‘ఆప్కాస్‌’ అనే పేరు పెట్టారు. ఇందులో చాలా కార్పొరేషన్లలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను, శానిటేషన్‌ వర్కర్లను చేర్చనేలేదు.

టీడీపీ హయాంలో నియమితులై రూ.40వేల కంటే ఎక్కువ జీతమున్న వారందరినీ తప్పించి సొంత మనుషులను కూర్చోబెట్టారు. ‘ఆప్కాస్‌’కు నిధులు విడుదల చేయలేదు. కానీ డిజిటల్‌ కార్పొరేషన్‌తోపాటు వైసీపీ సేవచేసిన సంస్థలకు నిధులు గుమ్మరించారు. ఈ గుట్టంతా ఐ అండ్‌పీఆర్‌లో ఉందని, విచారణ చేస్తే బయటకు వస్తుందంటున్నారు.

Related posts

జిల్లా కలెక్టర్లతో సిఎస్ వీడియో సమావేశం

Bhavani

ఆల్ ఆర్ ఈక్వల్ :మంత్రి కారు తనిఖీ చేసిన పోలీస్ లు

Satyam NEWS

గ్రామాలలో మౌలిక వసతులు కల్పించలేకపోతే ఎందుకు?

Bhavani

Leave a Comment