26.2 C
Hyderabad
February 14, 2025 01: 20 AM
Slider తెలంగాణ

ఆల్ ఆర్ ఈక్వల్ :మంత్రి కారు తనిఖీ చేసిన పోలీస్ లు

police minister car

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యం లో ధన ప్రవాహాన్ని నివారించేందుకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తొర్రూరు ప్రాంతంలో ప్రత్యేక పికెట్ ను ఏర్పాటు చేసి వాహనాలను చెక్ చేస్తున్నారు. అటుగా వెళ్తున్నతెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు.మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
కొడకండ్ల వైపు వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కారులో అదే మార్గంలో వస్తుండగా కారును ఆపిన తరువాత మంత్రిని గుర్తించిన పోలీసులు, తనిఖీ చేసేందుకు తటపటాయియించారు.వారి ఇబ్బందిని గ్రహించిన మంత్రి తన వాహనాన్ని తనిఖీ చేయాలని ఎర్రబెల్లి కోరారు.చట్టం ముందు అందరు సమానమేనని ,పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు తాను సహకరిస్తానని, నిబంధనల ప్రకారం కారును చెక్ చేసుకోవచ్చని ఆయన అన్నారు. తనిఖీల అనంతరం అందులో ఏమీ లేదని తేల్చిన పోలీసులు, ఎర్రబెల్లి కారు ముందుకు వెళ్లేందుకు అనుమతించారు.

Related posts

పేకాట‌రాయుళ్ల‌పై దాడులు భారీగా ప‌ట్టుబడ్డ న‌‌‌గ‌దు

Sub Editor

డేంజర్ గేమ్: వెంకన్న డిపాజిట్ల భద్రత గాలిలో దీపం

Satyam NEWS

Form house case: బీజేపీ కీలకనేతకు సమన్లు

Satyam NEWS

Leave a Comment