23.2 C
Hyderabad
May 8, 2024 00: 37 AM
Slider కర్నూలు

గ్రామాలలో మౌలిక వసతులు కల్పించలేకపోతే ఎందుకు?

#Public associations

నంద్యాల జిల్లా పాములపాడు మండలంలోని అన్ని గ్రామాలలో మౌలిక వసతులు కల్పించలేని మండల సర్వసభ్య సమావేశం ఎందుకని ఎంపీడీవో ఆఫీస్ ముందర ప్రజాసంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నందికొట్కూర్ అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు జనసేన మండల నాయకులు రాంభూపాల్ మాట్లాడుతూ రోడ్లు కుళాయిలు విద్యుత్ సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించాలనీ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు.

మద్దూరు రుద్రవరం ఎస్సీ కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని కాలనీలలో ఎన్నో సంవత్సరాల నుండి ఒక సిమెంట్ రోడ్డు కూడా లేదని కనీసం తాగటానికి కుళాయిల కనెక్షన్లు కూడా లేవని రాత్రి వేళల్లో విద్యుత్ స్తంభాలకు బల్బులు లేక వర్షాకాలం వస్తే కటిక చీకటిలో బయటికి రావాలంటే ఎంతో ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు.

విషపురుగులు సంచరిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు 25 లక్షలు ప్రభుత్వం ప్రకటించిన ఆ వచ్చిన నిధులు నుండి ఎందుకు ఎస్సీ కాలనీలలో మౌలిక వసతులు కల్పించకుండారో సమాధానం చెప్పాలని రాజకీయ అండదండలు ఉన్న అగ్రవర్ణాల కల్లాల ముందర సిమెంట్ రోడ్లు వేస్తున్నారు తప్ప ఎస్సీలు ఎస్టి బీసీలు నివసించే ఇండ్ల ముందర మాత్రం సిమెంట్ రోడ్లు వేయకుండా వెళుతున్నారంటే అసలు మనుషులుగా గుర్తిస్తున్నారా అనే అనుమానంగా ఉందని తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన క్రింద మిట్టకందాల నుండి కృష్ణారావు పేట వరకు తారు రోడ్డు నిర్మించి అక్కడక్కడ కల్వర్టులు నిర్మించనందున వర్షాకాలం భారీ ఎత్తున పొలాలలోనున్న వర్షపు నీరు వచ్చి మిట్ట కందల ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల నందు ప్రవహిస్తూ ప్రభుత్వ పాఠశాల మీదుగా భారీ ఎత్తున నీరు పారుతున్నందున ఒక్కొక్కసారి బడి పిల్లలను ట్రాక్టర్ల సహాయంతో ఇంటికి చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వెంటనే కల్వర్టులు నిర్మించి మిట్ట కందాల గ్రామంలోకి వర్షపు నీరు రాకుండా చేయాలని ఎన్నోసార్లు పంచాయతీ రాజ్ అధికారులకు వినతి పత్రాలు పత్రికా

ప్రకటనల ద్వారా తెలియజేసిన పట్టించుకోవడంలేదని ఆనందాపురం ఇస్కాల గ్రామాల బ్రిడ్జిలను నిర్మించి ప్రజలను ఆదుకోవాలని మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ సమావేశంలో ఏ పనులను గుర్తించి నిర్ణయం తీసుకున్నారో ఏ పనులు చేసి ఏ పనులు గుర్తించారో శ్వేతాపత్ర విడుదల చేయాలని గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించిందని బ్లీచింగ్ పౌడర్ చల్లి ప్రజలను మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ మరియు విష జ్వరాల బారిన పడకుండా కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే వచ్చే సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో VHPS నాయకులు శ్రీనివాసులు రాజు స్వాములు సమర తదితరులు పాల్గొన్నారు.

Related posts

హై కోర్టు తీర్పును పెడచెవిన పెడుతున్న జగన్ సర్కార్

Satyam NEWS

నిరుద్యోగులకు వయో పరిమితి నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలి

Satyam NEWS

పాలనలో విఫలమైన వారు చంద్రబాబుకు పాఠాలు చెబుతారా?

Satyam NEWS

Leave a Comment