29.2 C
Hyderabad
June 30, 2024 16: 03 PM
Slider సంపాదకీయం

అసెంబ్లీ స్పీకర్ నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్న జగన్‌రెడ్డి

#jagan

ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవడం ఒక రకం. అయితే దాని కోసం స్పీకర్ నే బ్లాక్ మెయిల్ చేయాలని అనుకోవడం మరొక రకం. ఈ తరహా ప్లాన్ ను జగన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10 శాతం సీట్లు ఉండాలని సాంప్రదాయాలు నిబంధనలు చెబుతుంటే జగన్ రెడ్డి మాత్రం వితండవాదంతో తనకు అన్యాయం జరుగుతున్నట్లు పిక్చర్ ఇచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 175 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 10 శాతం అంటే కనీసం 18 మంది సభ్యులు ఉండాలి. అయితే జగన్ రెడ్డికి వచ్చింది కేవలం 11 సీట్లు మాత్రమే.

ఏపీ అసెంబ్లీలో పట్టుమని 11 సీట్లు కూడా లేకుండానే వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ తనకు ప్రతిపక్ష హోదా కావాలని మంకు పట్టు పడుతున్నారు. ఈ ధోరణి అన్ని వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత 2019 ఎన్నికల వేళ 25 సీట్లు వచ్చిన టీడీపీని జగన్ మోహన్ రెడ్డి ఏ రకంగా అవమానించారో అంతా గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఈ రోజు కేవలం 11 సీట్లతో ఎలా ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడానికి అసలు జగన్ కు నోరు ఎలా వస్తోందని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.

ప్రతిపక్ష హోదా కోసం గగ్గోలు పెడుతున్న జగన్ మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చారు. ఏపీ సచివాలయంలో పయ్యావుల విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల్లో జగన్ కు వచ్చిన సీట్ల కారణంగా ఆయన పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని.. అందుకే జగన్‌ ప్రతిపక్ష నేత కాలేరని తేల్చి చెప్పారు. జగన్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. 50 ఏళ్లుగా ఉన్న నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.

అటు కేంద్ర ప్రభుత్వంలోనూ కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రావడానికి పదేళ్లు పట్టిందని.. 2014 నుంచి 2024 వరకూ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమే లోక్ సభలో ఉండేవారని గుర్తు చేశారు. జగన్ కు మిత్రుడైన కేసీఆర్‌ కూడా 2019లో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్పించుకొని మరీ కాంగ్రెస్ ను దెబ్బతీశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాసిన జగన్‌ బెదిరించే ప్రయత్నం చేశారని.. లేఖ రాసింది మీరే అయితే వైఖరి మార్చుకోవాలని అన్నారు. దాన్ని రాసింది సలహాదారులైతే ఆ సలహాదారుడ్ని మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తే.. దాన్ని జీర్ణించుకోలేని స్థితిలో జగన్‌ ఉన్నారనే విషయం స్పీకర్‌కు రాసిన లేఖను బట్టి తెలుస్తోందని అన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో జగన్ లేఖ రాశారని.. ప్రతిపక్ష హోదా కావాలంటే.. జగన్ కు మరో పదేళ్ల సమయం పట్టొచ్చని ఎద్దేవా చేశారు. బహుశా 2029కి ట్రై చేసుకోవచ్చని అన్నారు. జీతాలు, పెన్షన్లు ఇచ్చే యాక్ట్‌ ప్రకారం ప్రతిపక్ష హోదా వస్తుందని అసలు జగన్ కు ఏ పెద్దమనిషి సలహా ఇచ్చారో అని పయ్యావుల గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ అంతమంది సలహాదారులను పెట్టుకుని ఏం ప్రయోజనం అని.. వారి సలహాలు తీసుకుంటే మునిగిపోతానని జగన్‌ గుర్తించాల్సిందని పయ్యావుల అన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు

Satyam NEWS

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీనివాస్

Satyam NEWS

ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద అలజడి .. పోలీసుల పహారా

Sub Editor

Leave a Comment