కుమరం బీమ్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఆదాబ్ హైదరాబాద్ పత్రిక విలేకరి అంగల తిరుపతి పై దాడి చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరుతూ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చింతలమండపల్లి ఎస్సై నరేష్ కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. వినతిపత్రం అందచేసిన వారిలో పత్రికా విలేకరులు తాళ్లపల్లి నవీన్ గౌడ్, చౌదరి హరి, చౌదరి చంద్రశేఖర్, లాట్కరి శంకర్, కోట సాయి, చౌదరి లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.