29.7 C
Hyderabad
May 7, 2024 03: 47 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు

#indirabhavan

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో 73వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు,వార్డ్ కమిటీ,బూత్ కమిటీ  అధ్యక్షులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాముల శివారెడ్డి,బ్లాక్  కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,రాష్ట్ర కాంగ్రెస్ సహాయ కార్యదర్శి ఎండి. అజీజ్ పాషా,బాచిమంచి గిరిబాబు, మాజీ జడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ బొల్లెద్ ధనమ్మ, వెలిదండ సరిత,కారంగుల విజయ, తేజావత్ రాజా,పట్టణ వర్కింగ్ అధ్యక్షుడు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, గొట్టిముక్కుల రాములు,మైనారిటీ  వర్కింగ్ అధ్యక్షుడు షేక్ సైదా మేస్త్రి, బూత్ కమిటీ ఎన్ రోలర్స్,పోతన బోయిన రామ్మూర్తి,కోల్లపూడి యోహాన్, వల్లపుదాసు కృష్ణ,కంకణాల పుల్లయ్య, దొంతగాని జగన్,జింజిరాల సైదులు, సంక్రాంతి కోటేశ్వరరావు,వెలిదండ వీరారెడ్డి, కరెంగుల వెంకటేశ్వర్లు. నాయకులు ముషం సత్యనారాయణ, లచ్చిమల్ల నాగేశ్వరరావు,మేళ్లచెరువు ముక్కంటి,సులువా చంద్రశేఖర్,కోడి మల్లయ్య, పెద్దబ్బాయి,దాసరి పున్నయ్య,కాస్తాల పెద్ద సైదులు, కొల్లపూడి డేవిడ్,గజివెల్లి వెంకటేశ్వర్లు పిలుట్ల మధు,పట్టణ మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి,మహిళా నాయకురాలు గడ్డం వెంకటమ్మ ఆటో యూనియన్ నాయకులు కస్తాల రవీందర్,రెడిపంగు రాము,ఫరీదు మాతంగి బుచ్చయ్య, పార్టీ ముఖ్య నాయకులు అందరు రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి యొక్క సేవలను గుర్తు చేస్తూ     భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి, దేశంలోని అన్ని మతాలు,జాతులు ఒకటే అనే విధంగా మన భారత రాజ్యాంగాన్ని పొందుపరచారని అన్నారు.

ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం ఉన్న దేశాలలో భారతదేశ రాజ్యాంగానికి ఒక గొప్ప ఉన్నత స్థానం ఉందని అన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అందరూ స్వీట్లు  పంచుకొని గణతంత్ర దినోత్సవ సంబరాలు పంచుకున్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మంచి సందేశం ఇచ్చే చిత్రం పలాస 1978

Satyam NEWS

ఐఐటీ, నీట్ స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించిన భూమన

Satyam NEWS

రుణ మాఫీ పథకం అమలు తెలంగాణలో కేవలం ఐదు శాతమే

Satyam NEWS

Leave a Comment