29.2 C
Hyderabad
June 30, 2024 16: 10 PM
Slider ముఖ్యంశాలు

చిరంజీవి మాజీ అల్లుడు భరద్వాజ్ మృతి

#srija

మెగా స్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ నేడు మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఊపిరితిత్తులు పని చెయ్యని కారణంగా శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. శిరీష్ భరద్వాజ్, మెగా స్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజని 2007 సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత కొన్ని సంవత్సరాల తరువాత వీరిద్దరి మధ్య పొరపొచ్చలు రావటం 2014లో విడిపోయారు. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. తరువాత శిరీష్ భరద్వాజ్ ఇంకొక వివాహం చేసుకున్నాడు. శిరీష్ భరద్వాజ్ గుండె పోటుతో మృతి చెందినట్టుగా శిరీష్ స్నేహితులు తన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.

Related posts

బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ దాదాపుగా ఖరారు

Satyam NEWS

జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

దుబ్బాకలో వందపడకల ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి హరీష్

Satyam NEWS

Leave a Comment