29.2 C
Hyderabad
June 30, 2024 15: 54 PM
Slider జాతీయం

పిన్నెల్లి అరెస్టు పై కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికర వ్యాఖ్య

#Election

మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదని, మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే దీనికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికలు నిర్వహించే విషయంలో ఇంకెవరూ దుశ్చర్యలకు పాల్పడబోరన్న ఆశాభావాన్ని ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. ఈవీఎం ధ్వంసానికి కారణమైన ఎమ్మెల్యేను (ప్రస్తుతం మాజీ) సైతం అరెస్టు చేయడం ఈసీఐ ఆదర్శప్రాయమైన చర్యలకు ఉదాహరణగా పేర్కొంది.

హోదాతో సంబంధం లేకుండా, ఎవరూ చట్టానికి అతీతులు కాదనే సూత్రాన్ని ఇది బలపరుస్తోందని వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియను పరిరక్షణకు ఈసీ కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్యాన్ని బెదిరించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయడం అనేది ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో ఈసీఐ అంకితభావానికి నిర్దిష్ట ఉదాహరణగా అభివర్ణించింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ బుధవారం ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే.

ఏపీలో మే 13న జరిగిన ఎన్నికలో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలో పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ నెం.202లో పిన్నెల్లి దారుణానికి ఒడిగట్టారు. ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించినట్టు ఈసీ పేర్కొంది. శాసనసభలో సిట్టింగ్ సభ్యుడిగా (ఎమ్మెల్యే) ఉండి ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ధ్వంసం చేయడం నేరపూరిత చర్య అని ఈసీ వ్యాఖ్యానించింది.ఎమ్మెల్యే చర్య ప్రజాస్వామ్య ప్రక్రియపై జరిగిన ఘోరమైన దాడిగా ఎన్నికల సంఘం అభివర్ణించింది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలకు ఈవీఎంలు మూల స్తంభాలు అని, అటువంటి ఈవీఎంలను పాడు చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సమగ్రత దెబ్బతిన్నదని పేర్కొంది. ఇలాంటి చర్యల కారణంగా ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ఫలితాల చట్టబద్ధతపై సందేహాన్ని కలిస్తుందని విచారం వ్యక్తం చేసింది. పిన్నెల్లి ఘటనను ఈసీఐ చాలా తీవ్రంగా పరిగణించి విషయం తెలిసిందే.

Related posts

రాయలసీమకు రాజధాని తరలించాలి

Satyam NEWS

ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

Satyam NEWS

188 మండలాల్లో తీవ్ర వడగాలులు

Bhavani

Leave a Comment