29.2 C
Hyderabad
June 30, 2024 16: 22 PM
Slider ప్రత్యేకం

ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్న జగన్ రెడ్డి శాడిజం

#jagan

ఎన్నికల ఫలితాలు వచ్చి ఓడిపోయాడు తుక్కు తుక్కుగా.. ఇక ప్రతి పక్ష హోదా కూడా లేదు, ఈ జన్మలో ఇక జగన్ సిఎం కాలేడు, వైకాపా అధికారంలోకి రాదు అని నమ్మినాక, భయంతో సమాధి అయిన ఒక్కో.. నిజం వెలుగులోకి వస్తోంది. గతంలో జగనుతో పనిచేసి, మాజీలు అయిన అధికారులు ధైర్యంగా నోరు విప్పుతున్నారు. సమయం ఇస్తే తమను భయపెట్టి ఎలా పావులుగా చేసి రాజకీయ వికృతక్రీడ ఆడాడో చెప్పడానికి, బొకేలు పట్టుకొని తిరుగుతున్నారు ఇంకా సర్వీసులో వున్నవారు. రెడ్ బుక్ లో తమ పేరు వుందేమో అని ఉలిక్కిపడుతూ మరికొంతమంది పావులు వచ్చి లోకేష్ ని కలిసిన ఫోటోలు చూసి, అభిమానులు సోషల్ మీడియాలో బాధపడుతున్నారు. వాళ్ల వర్షన్ వినాలి కదా. ఎలా భయపెట్టింది, ఎలా ఇరికించింది, ఎలా కేసులు పెట్టింది అన్నీ తెలుసుకోవాలి కదా. అప్పుడే కేసులు కొట్టివేసి, పావుల వెనక వున్న వారి గురించి తెలుసుకొని, చట్టప్రకారం చెయ్యాల్సింది చెయ్యడానికి.

ఇక విషయానికి వస్తే.. జగన్ ఒక భయంకర ఆలోచన చెప్పాడు. వైజాగ్ స్టీల్ ప్లాంటు పీకేసి, అక్కడ రాజధాని సిటీ కడదాం అని. తాజగా మాజీ సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం టీవీ5 కి ఇచ్చిన ఇంటర్వూలో.. నేను షాక్ తిన్నాను అన్నారు. ఏమిటీ ఆలోచన అని వాదిస్తే.. తిరస్కరించాడట. ఇలా మాట్లాడతావేమన్నా.. నీతో వచ్చిన సమస్య ఇదే అని ఎల్వీని దెప్పిపొడిచాడట జగన్. దాంతో పాటూ జగన్ చుట్టూ వున్న వారు ఎవరూ ఆయనకు ఎదురు చెప్పడానికి ధైర్యం చేసేవారు కాదు. కానీ జగన్ చెప్పిన దానికి తలాడించే ఆఫీసర్లను “ఎఫిషియంట్ ఆఫీసర్లు” అని ఆయన భావించేవారు. అలాంటి భయంకర ఆలోచన వున్న జగన్ లాంటి వారిని నాయకులను చేసి, పదవిలో కూర్చోబెడితే సర్వనాశనం చేస్తారు. ఊహించను కూడా ఊహించలేము ఇలాంటి వారి భయంకర ఆలోచనలను అంటూ చాలా విషయాలను వివరించారు.

రిషికొండలో కేవలం తాను కాపరం పెట్టడానికి ప్రెసిడెన్షియల్ సూట్, ఎప్పుడో వచ్చే ఇద్దరి కూతుళ్ల కోసం చెరో విల్లా సూట్, అధికారులు, పార్టీ నాయకులను కలవడానికి మిగిలిన మందిరాలను పదెకరాల్లో 500 కోట్లు ఖర్చు చెయ్యడాన్ని, అందులో ఇంటీరియర్స్, బయోమెట్రిక్ బెడ్రూం వాడ్రోబ్స్‌ను చూసి జనం అవాక్కయ్యారు. పేదల నుండి ప్రభుత్వ భూముల వరకు కబ్జీ చేసి తమవారి రాంకీతో వైకాపా కోసం కట్టిస్తున్న ప్యాలస్‌లను చూసి జనం తెర్చుకొన్న నోర్లను మూసుకోలేదు. 

ఈ కాలం యువతకు ఆయన చరిత్ర తెలుసుకొనే సమయంలేదు. 1994లో అంటే 22 ఏళ్లు కూడా నిండని జగన్ పోలీస్టేషన్ మీద దాడి చేసి ఎస్సైని కొట్టాడు. 40 ఏళ్లు కూడా రాని సమయానికే అయ్యను బెదిరించి, అయ్య అధికారాన్ని కాళ్లదగ్గరికి రప్పించి 43000 కోట్లకు పైగా అవినీతికి పాల్పడి.. 11 సీబీఐ చార్జ్‌షీట్లతో 16 నెలలు చంచల్‌గూడ జైల్లో చిప్పకూడు తిని బెయిలు మీదకు వస్తే, 50 ఏళ్లు నిండకనే సిఎం కుర్చీలో కూర్చోబెడితే.. ఎలాంటి ఆలోచాలు వస్తాయి?

మీరే ఆలోచించి చెప్పండి. చదువా సంధ్యా? సాక్షికి & జగతి పబ్లికేషన్ మేనేజ్మెంట్లో ఎంబీయే చేసినట్లు ఫేక్ రెజ్యూం చేసి, దాని షేర్ వాల్యూలు పెంచి, ప్రీమియం ధరలకు అమ్మాడు. తరువాత ఎన్నికల అఫిడవిట్లో ఎంబీయేని పీకేసి, బీకాంకు మాత్రం పరిమితం అయ్యాడు.  కనీసం బికాం చదివినట్లు ఏ ఒక్క రోజైనా ప్రవర్తించాడా.. మీడియాను ప్రశ్నలను ఎదుర్కొన్నాడా? ఏ శాఖ చూసినా.. పీల్చి పిప్పి చేసి, కోలుకోకుండా ధ్వంసం చేసి కుక్కలు చింపిన విస్తరిలా చేసి వెళ్లాడు. ఈ భయంకరుడు మళ్లీ అధికారంలోకి వచ్చి వుంటే ఎన్ని ఘోరాలు జరిగేవో. తలచుకొంటేనే జనానికి ఒళ్లు జలదరిస్తోంది.

Related posts

పైడితల్లి తొలేళ్ల పండుగ లో తప్పిపోయిన 4 ఏళ్ల చిన్నారి..

Satyam NEWS

భారత దేశ ఏకీకరణ లో పటేల్ పాత్ర కీలకం

Satyam NEWS

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన మాగుంట

Bhavani

Leave a Comment