38.2 C
Hyderabad
May 5, 2024 20: 23 PM
Slider విజయనగరం

పైడితల్లి తొలేళ్ల పండుగ లో తప్పిపోయిన 4 ఏళ్ల చిన్నారి..

#missinggirl

4  గంటలలో అమ్మ ఒడికి చేర్చిన పోలీసులు..!

విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. సందర్భంగా ముందు రోజు తొలేళ్ల ఉత్సవం..ఉత్సాహ వంతంగా..భక్తుల రద్దీ తో నగరం మొత్తం కిటకిటలాడుతోంది. సరిగ్గా సాయంత్రం ఆరుగంటలకు…టెంపుల్ ఎదురుగా ఏర్పాటు చేసిన పోలీసు కంట్రోల్ రూం నుంచీ మైక్ అనౌన్సమెంట…నాలుగేళ్ల చిన్నారి తప్పిపోయింది… కన్నవారు ఎక్కడున్నా..కంట్రోల్ రూమ్ కు రావాలని…అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేసిన సూచనలు.

సీన్ కట్ చేస్తే…తొలేళ్ల మొత్తం భక్తుల రద్దీ తో కిటకిటలాడుతున్న సందర్భంలో… నాలుగేళ్ల చిన్నారి యషిత్ తప్పిపోవడాన్ని గుర్తించిన పోలీసు సిబ్బంది.. ఆ రద్దీ ప్రాంతంలో చిన్నారి కన్నవారి కోసం గాలించారు.. దాదాపు ఆరగంట నుంచీ గాలించినా…ప్రయోజనం లేకపోవడంతో… వెంటనే చిన్నారి ని తీసుకుని కంట్రోల్ రూంకు తీసుకెళ్లి అప్పగించారు.

ఇక అప్పటి నుంచీ కంట్రోల్ రూం నుంచీ మైక్ లో అనౌన్సమెంట్ చేస్తునే ఉన్నారు. ఒకటి, రెండు మూడు.. నాలుగు గంటల కావస్తున్న..సమయం రాత్రి తొమ్మిది న్నర అవుతున్న చిన్నారి కన్నవారు రాలేదు… అదే సమయంలో మైక్ అనౌన్సమెంట్ విన్న రెల్లి వీధి కి చెందిన చిన్న ప్రసాద్..చిన్నారి తండ్రి తన భార్య తో కంట్రోల్ రూంకు రావడంతో అమ్మ ,నాన్పలను చూసి న చిన్నారి పోల్చడం తో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు దాదాపు నాలుగు గంటల తర్వాత చిన్నారి.. కన్నవారి చెంతకు చేరడం చిన్నారి అదృశ్యం కథ ముగిందని చెబుతోంది… సత్యం న్యూస్. నెట్.

Related posts

సిఎం జగన్ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వద్దు

Satyam NEWS

నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్

Satyam NEWS

వందేళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ ఈ స్థాయి కి చేరింది

Satyam NEWS

Leave a Comment