29.2 C
Hyderabad
June 30, 2024 16: 06 PM
Slider ప్రత్యేకం

కాన్వాయ్ వెంట మహిళ పరుగులు….కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు

#chandrababu

కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది.

ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి….ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది. తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. మా కష్టం ఫలించి….మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్….ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా… చంద్రబాబు సున్నితంగా వారించారు.

ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడడాలని వచ్చాను అని నందిని చెప్పగా…ముందు ఆసుపత్రికి వెళ్లు అంటూ సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని…. అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Related posts

పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగించే తొలి మెట్టు ట్రాఫిక్ పోలీసులే

Satyam NEWS

ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వారికి ఉరిశిక్ష

Satyam NEWS

తగ్గుతున్న కరోనా విస్ఫోటనం జరిగేందుకు ఇది అవకాశం కాదా?

Satyam NEWS

Leave a Comment