Slider వరంగల్

తగ్గుతున్న కరోనా విస్ఫోటనం జరిగేందుకు ఇది అవకాశం కాదా?

#ShyampetTRS

వరంగల్ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు. ఈ వార్త టీఆర్ ఎస్ నాయకులకు ఆనందం కలిగిస్తుందేమో కానీ వారిని చూస్తే కరోనా ఎక్కడ విజృంభిస్తుందోనని సామాన్యులకు మాత్రం భయం కలుగుతున్నది.

లాక్ డౌన్, భౌతిక దూరం నిబంధనలు టిఆర్ఎస్ నాయకులు వర్తించవా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నిబంధనలు కేవలం సామాన్యులకేనా అంటూ ప్రజల నుండి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నెల రోజులుగా ఇళ్లకే పరిమితమై నానా ఇబ్బందులు పడుతూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఉన్న ప్రజలకు ఒక రూలు టీఆర్ఎస్ వారికి ఒక రూలా అంటూ విరుచుకుపడుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినా స్థానిక నాయకులు వినడం లేదంటే దీనికి అర్ధం ఏమిటి? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

Related posts

స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి

Sub Editor

ములుగులో ఘనంగా మండల పూజోత్సవాలు

Satyam NEWS

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment