29.2 C
Hyderabad
June 30, 2024 15: 24 PM
Slider ముఖ్యంశాలు

చార్జి తీసుకున్న వెంటనే పవన్ కల్యాణ్ చేసింది ఏమిటంటే…

#pawankalyan

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 9.30 పవన్ బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌ అనంతరం మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం  ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. 

వారితోపాటు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వివిధ అంశాలపై పవన్ పవన్ చర్చించారు. బాధ్యతలు చేపట్టిన రోజే వరుస సమావేశాలతో పవన్ కల్యాణ్ బిజీ, బిజీగా గడిపారు. పవన్‌ కళ్యాణ్‌.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లైస్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలున్నాయి.  తనకి ఇష్టమైన గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తానని పవన్‌ స్పష్టం చేశారు.

ఎన్నికలకి ముందు గ్రామాల్లో తన పర్యటన సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ నేడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే కంటే ముందు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. వారిరువురూ రాష్ట్రంలో నిర్వహించాల్సిన పరిపాలనపై చర్చించుకున్నారు.

ఇద్దరు రెండు పార్టీలకి అధినేతలుగా ఉన్నప్పటికీ.. పరిపాలనలో ఇద్దరూ సమభాగస్వాములుగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్‌ తాను బాధ్యతలు స్వీకరించే కంటే ముందు సీఎం చంద్రబాబుతో భేటీ అయినట్టు తెలుస్తోంది.  ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఆయన మంగళవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చారు.

మొదటి బ్లాక్‌లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఛాంబర్‌కు వెళ్లి భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారి తన ఛాంబర్‌కు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చంద్రబాబు సీటులోంచి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఛాంబర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి.. ఆ గుర్తుకే హుందాతనం తెచ్చారని చంద్రబాబును పవన్‌ కొనియాడారు.

దీనికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. భేటీ దాదాపుగా గంటన్నరసేపు కొనసాగింది. ఇందులో దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా సమావేశమయ్యారు.

Related posts

మండుటెండలో ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న పనేంటో తెలుసా…?

Satyam NEWS

అనంత రవాణా శాఖలో ACB సోదాలు

Satyam NEWS

పులిని చంపి చర్మం అమ్ముతున్న ముగ్గురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment