29.2 C
Hyderabad
June 30, 2024 15: 46 PM
Slider కృష్ణ

ముస్లింలపై విషం చిమ్ముతున్న జర్నలిస్టు సాయి

#vijayawadapolice

మతసామరస్యాన్ని విఘాతం కలిగించేలా జర్నలిస్ట్ సాయి వీడియోలు తీస్తున్నందున జర్నలిస్ట్ సాయి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి కోరారు. ఒక మతంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తను జర్నలిస్ట్ సాయి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం సంఘ విద్రోహక చర్య క్రిందకి వస్తుందని, ఇలాంటి తప్పుడు వార్తలు మతసామరస్యానికి భంగం కలిగిస్తాయని సంఘవిద్రోహక శక్తులకు ఊతమిస్తాయని, సోదర భావంతో మెలుగుతున్నవారి మధ్యలో పొరపచ్చలు వస్తాయని ఆయన అన్నారు. ఇలాంటి వాటిని వెంటనే నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఫారూఖ్ షుబ్లి విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ ను వారి కార్యాలయం నందు కలిసి సాయి పై కేసు నమోదు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీనిపై కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.హెచ్.డి రామకృష్ణ తగు చర్యలను తీసుకుంటామని అన్నారు.

Related posts

సొంతూరికి పోతున్నా . . .

Satyam NEWS

చిన్న మధ్య తరహా దినపత్రికల డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

మోడీకి వీసా తిరస్కరించిన దేశమేనా అది?

Satyam NEWS

Leave a Comment