37.7 C
Hyderabad
May 4, 2024 13: 44 PM
Slider ముఖ్యంశాలు

చిన్న మధ్య తరహా దినపత్రికల డైరీ ఆవిష్కరణ

#allamnarayana

తెలంగాణ రాష్ట్ర చిన్న మధ్య తరహా దిన పత్రికల సంఘం 2023 డైరీని రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ నేడు ఆవిష్కరించారు. సమాచార భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర చిన్న మధ్య తరహా దిన పత్రికల సంఘం వ్యవస్థాపకుడు కె.ఎస్.రంగసాయి ( ద స్కైలైన్) అధ్యక్షత వహించారు.

సీనియర్ జర్నలిస్టు రాష్ట్ర చిన్న మధ్య తరహా దిన పత్రికల సంఘం సలహాదారుడు సత్యమూర్తి పులిపాక (సత్యంన్యూస్.నెట్) కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమాచార శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, అదనపు డైరెక్టర్ నాగయ్య కాబ్లీ తదితరులు కార్యక్రమానికి విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి చిన్న మధ్య తరహా దిన పత్రికల సంఘం సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిన్న మధ్య తరహా దిన పత్రికల సంఘం కన్వీనర్ తాటికొండ కృష్ణ (సత్యవార్త) జి. శ్రీనివాస్ (ప్రజాక్రాంతి) ఎస్ ఎస్ కె హుస్సేనీ ఇక్బాల్ (డెక్కన్ సమాచార్) కె మాధవరెడ్డి (విశాల తెలంగాణ) తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కొల్లాపూర్ నియోజక వర్గ సర్వేలో జూపల్లిదే పైచేయి

Satyam NEWS

50 మంది స్కూల్ పిల్లలపై పిచ్చి కుక్కల దాడి

Satyam NEWS

చంద్రబాబు అవినీతి బట్టబయలు చేశాం

Satyam NEWS

Leave a Comment