23.7 C
Hyderabad
June 28, 2024 05: 42 AM
Slider ఆధ్యాత్మికం

అన్నప్రసాదంలో నాణ్యతను మరింత మెరుగుపరచండి

#tirumala

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టీటీడీ అన్నప్రసాద విభాగం కార్యకలాపాలను బుధవారం ఈవో సమీక్షించారు. టీటీడీలోని ప్రతి విభాగం పని తీరుపై తెలుసుకోవడంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మంలతో కలిసి అన్నప్రసాద విభాగాన్ని సంబంధిత అధికారులతో కలసి ఈవో సుదీర్ఘంగా సమీక్షించారు.

తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌(ఎంటీవీఏసీ), విక్యూసీలోని అక్షయ కిచెన్‌, పీఏసీ 2తో పాటు, ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి అతిథి గృహం సహా తిరుమలలో అన్నప్రసాదాలు తయారు చేసే ప్రదేశాలను ఆయన సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, తాత్కాలికంగా నిలిపివేసిన పాంచజన్యం వంటశాలను త్వరగా ప్రారంభించేలా చూడాలని అన్నప్రసాదం, ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

తిరుమల, తిరుపతి లతో కలిపి రోజుకు సగటున తిరుమలలో 1.92 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరిస్తుండగా వీరిలో తిరుమల లో దాదాపు 1.75లక్షలు, తిరుపతిలో 17 వేలు, వారాంతాల్లో తిరుమలలో రమారమి 1.95 లక్షలు, తిరుపతిలో 19 వేలతో కలిపి సుమారు 2.14 లక్షల మందికి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఒక రోజున అన్నప్రసాదం కోసం అవుతున్న ఖర్చు దాదాపు రూ.38 లక్షలుగా ఉంది. ఈ సందర్భంగా కూరగాయల దాతలు, ఒకరోజు విరాళం పథకం తదితర అంశాలపై కూడా ఈఓ సమీక్షించారు.

అనంతరం భక్తులకు అందజేస్తున్న మజ్జిగలో నాణ్యత పెంచాలని, వంట చేసే స్థలంలో ఆవరణను పరిశుభ్రంగా, పొడిగా ఉంచాలని అధికారులకు ఈఓ సూచించారు. ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఫుడ్ క్వాలిటీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. తిరుమల, తిరుపతిలలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని పెంచడం, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దశాబ్దాల నాటి యంత్రాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడం, అన్నప్రసాదం నాణ్యతను పెంచేందుకు ఫుడ్‌ కన్సల్టెంట్‌ను నియమించడం వంటి అంశాలకు సంబంధించి వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని సంబంధిత అధికారులను ఈఓ ఆదేశించారు. డిప్యూటీ ఈఓ రాజేంద్ర, క్యాటరింగ్ స్పెషల్ ఆఫీసర్ జిఎల్ఎన్ శాస్త్రి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘ఆహా’లో వావ్ అనిపిస్తున్నవిక్రమ్ లగడపాటి “వర్జిన్ స్టోరీ”

Bhavani

“ఇప్పుడు కాక ఇంకెప్పుడు”  టీజర్ విడుదల!!

Satyam NEWS

భక్తుల నడుమ నేత్రపర్వంగా గోదాదేవి  కళ్యాణం

Satyam NEWS

Leave a Comment