29.2 C
Hyderabad
June 30, 2024 15: 53 PM
Slider కృష్ణ

వైసీపీ నేతల కనుసన్నల్లో డ్రగ్స్, స్పా పేరుతో వ్యభిచారం

#DGPAP

గంజాయి,డ్రగ్స్,క్రికెట్ బెట్టింగ్… వంటి వాటితో యువత దారి తప్పుతున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం  ఆంధ్రప్రదేశ్ డిజిపి ద్వారక తిరుమలరావును ఆయన ఆఫీసులో కలిసి ఫిర్యాధు అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్లకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం,  గుట్కాల విక్రయం,  అక్రమ మద్యం కూడా యదేచ్చగా వైసిపి నాయకుల కనుసనల్లోనే సాగిందని అన్నారు.

వీటన్నిటి మూలాలు.. విజయవాడలోనే ఉన్నాయి.  విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకుని రాష్ట్ర మొత్తం సరఫరా అవుతున్నాయని పేర్కొన్నారు. వీటి వలన యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందని…దీనిపైన మీరు దృష్టి పెట్టి.. డ్రగ్స్, బెట్టింగ్ మాఫియా, మద్యం మాఫియా, అసాంఘిక శక్తులఫై ఉక్కు పాదం మోపాలని డిజిపి గారికి అర్జీ ఇవ్వగా సానుకూలంగా స్పందించి.. అసాంఘిక శక్తుల పీచమనుస్తామని.. తెలిపారని అన్నారు. అలాగే డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డిజిపి ద్వారకాతిరుమల రావుకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన లీగల్ సెల్ గంజి పవన్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఆడ పిల్లలను పుట్టనిద్దాం.. ఎదగనిద్దాం.. చదవనిద్దాం…!

Bhavani

రష్యా వ్యాక్సిన్ తో విపరీతంగా సైడ్ ఎఫెక్టులు

Satyam NEWS

అంబేడ్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు

Bhavani

Leave a Comment