29.7 C
Hyderabad
May 7, 2024 04: 29 AM
Slider ముఖ్యంశాలు

అంబేడ్కర్ స్ఫూర్తితోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు

#Minister Puvvada Ajay Kumar

భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయుడికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో నూతనంగా నిర్మించిన సచివాలయంకు సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని నిర్మించి నేడు కేసీఅర్ చేతుల మీదగా లాంఛనంగా ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చరిత్రను అన్ని కులాలకు, మతాలకు అందించిన సేవలను మరోసారి ప్రజలు స్మరించుకునే విధంగా ప్రజలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.


భారత రాజ్యాంగంలో ఆర్టికల్ – 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ద్వారానే ఉద్యమ నాయకుడు కేసీఆర్ పోరాటస్ఫూర్తికి తెలంగాణ రాష్ట్రం కల సహకారమైందన్నారు.
దేశవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుని భారత పార్లమెంటుకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, సీఎం కేసీఆర్ తెలంగాణ సచివాలయంకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించారన్నారు.

Related posts

పోలీసు సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు

Satyam NEWS

మునుగోడులో  47 మంది పోటీ

Satyam NEWS

శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్న కె.రాఘవేంద్రరావు

Satyam NEWS

Leave a Comment