25.7 C
Hyderabad
June 29, 2024 02: 56 AM
Slider ముఖ్యంశాలు

ప్రధాని రోడ్ షోలో భద్రతా వైఫల్యం నిజమే

#modi

విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఘాటైన లేఖ ను కేంద్రం పంపింది. ప్రధాని ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివర్లో డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ప్రధాని రోడ్‍షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‍గా ప్రకటించారు. అయినా సరే రాష్ట్ర పోలీసులు SPG – SPG చెప్పిన మాట వినిపించుకోలేదు.

45 నిమిషాల ముందు డ్రోన్‍లను గుర్తించి ఒక డ్రోన్‍ను SPG డిఫ్యూజ్ చేసింది. ఏపీ పోలీసులకు ముందుగా చెప్పినప్పటికీ వినిపించుకోకుండా డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్ర ప్రభుత్వం, SPG సీరియస్ అయ్యాయి. ఇది భద్రతా వైఫల్యమేనని కేంద్ర హోం శాఖ తేల్చింది. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

Related posts

పబ్జి గేమ్ కు అలవాటు పడి పై గదిలో ఆత్మహత్య

Satyam NEWS

అత్యాచారం హత్యకు గురైన దేవిక కుటుంబాన్ని ఆదుకోవాలి

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రంలో ఆర్.ఎస్.ఎస్ ప‌థ సంచ‌ల‌నం…!

Satyam NEWS

Leave a Comment