28.2 C
Hyderabad
June 28, 2024 15: 11 PM
Slider విశాఖపట్నం

జగన్ పార్టీ నాయకుడి ఆత్మహత్యాయత్నం

#adipraju

విశాఖపట్నం పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అధిప్ రాజ్ ఆత్మహత్యయత్నం చేయడం సంచలనం కలిగించింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక వెలుగు వెలిగిన అధీప్ రాజ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అతను చేసిన ఆత్మహత్యా ప్రయత్నాన్ని బంధువులు తెల్లవారుజామున గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే అధిప్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య కి యత్నం చేశాడు. బంధువులు అతడిని హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆత్మహత్య ఘటన పై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.

అయితే ఈ వార్తలను అధీప్ రాజ్ ఖండించారు. తాను అలాంటి ప్రయత్నం చేయలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.

Related posts

రాజయోగం సినిమాతో రెండు గంటలు వినోదం గ్యారెంటీ

Bhavani

అన్నదాతకు అండగా ఉంటాం

Bhavani

ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గృహా నిర్బంధం

Satyam NEWS

Leave a Comment