40.2 C
Hyderabad
May 5, 2024 17: 31 PM
Slider ఖమ్మం

అన్నదాతకు అండగా ఉంటాం

#Venkateswarlu

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్య పడొద్దని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ధాన్యం కొనుగొళ్ళుపై పౌర సరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, డిఆర్డీఓ, జిజిసి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అన్నదాతలకు అండగా ఉంటామని చెప్పారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. దాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా అలస్యం కాకుండా కొనుగోళ్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ధాన్యం నాణ్యత లేదని రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు సహకార శాఖ ద్వారా 3243.160 మెట్రిక్ టన్నులు, జిజిసి ద్వారా 247.360 ద్వారా మొత్తం 3490.520 మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోళ్లు చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం నాణ్యత పాటించాలని చెప్పారు.

తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడవకుండా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని చెప్పారు. ధాన్యం నిల్వలు ఉండకుండా మిల్లులకు తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్‌లోడ్ చేయడంలో జాప్యం చేయొద్దని ఆయన చెప్పారు. దిగుమతి చేసిన ధాన్యపు వివరాలు ఓ.పి ఎం.ఎస్ లో అప్లోడ్ చేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్, పౌర సరఫరాల డిఎం త్రినాధ్, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, మార్కెటింగ్ అధికారి సలీం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జుగల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ సలహాదారుడు రామచంద్రమూర్తి రాజీనామా

Satyam NEWS

అవినాష్ రెడ్డే హంతకుడు: తేల్చి చెప్పిన షర్మిల

Satyam NEWS

వేముల‌వాడ రాజ‌న్న‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి

Satyam NEWS

Leave a Comment