23.7 C
Hyderabad
June 28, 2024 07: 50 AM
Slider హైదరాబాద్

తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడించిన టిఎన్ఎస్ఎఫ్

#katragadda

టీ టిడిపి ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ఆధ్వర్యంలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ను నేడు ముట్టడించారు. ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల చేతిలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలుబొమ్మగా మారిందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు.

ఇంటర్ బోర్డు నిబంధనలు తుంగలో తొక్కి IIT,NEET,JEE అకాడమీల పేరుతో జూనియర్ కళాశాల నడుపుతున్న కళాశాలపై ఫిర్యాదులు అందిన చర్యలు తీసుకోకపోవడానికి కారణం లోపాయికారీ ఒప్పందమా లేక ప్రభుత్వ పెద్దలు ఒత్తిడా అని ప్రశ్నించారు. నో ప్రాఫిట్ నో లాస్ పేరుతో సొసైటీ పై నడిచే జూనియర్ కళాశాలలో వివిధ రకాల కోచింగ్ ల పేరుతో లక్షల రూపాయల ఆర్థిక దోపిడి గురిచేస్తున్న ఇంటర్ బోర్డు అధికారులకు ఎందుకు కనిపించడం లేదని మండిపడ్డారు.

ఇంటర్ బోర్డు నిబంధన ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి 1,760/- రూపాయలు రెండవ సంవత్సరానికి 1,940/- మాత్రమే అని చెప్పే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ప్రైవేటు కళాశాలలు 1,50,000/- నుండి దాదాపు 3,60,000/- వరకు ఫీజులు వసూలు చేస్తున్న ఎందుకు కనిపించడం లేదని అన్నారు. పాఠ్యపుస్తకాలు, బుక్స్ మరియు డ్రెస్ మెటీరియల్ పేరుతో వేలాది రూపాయల దోపిడీ చేస్తున్న ఇంటర్మీడియట్ అధికారులు ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని అన్నారు.

Related posts

మణిపూర్‌ ఘటనపై ప్రధాని సీరియస్‌

Bhavani

ఆర్ధిక అక్షరాస్యత పై చైతన్యం

Bhavani

కేసీఆర్ కు పాలాభిషేకం ఇక చాపచుట్టిన ప్రతిపక్షం

Satyam NEWS

Leave a Comment