23.7 C
Hyderabad
June 28, 2024 05: 38 AM
Slider ముఖ్యంశాలు

కలెక్టర్ల ప్రక్షాళన పూర్తి చేసిన చంద్రబాబు

#APsecretariat

రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో ఇంత కాలం జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూసేందుకు పరితపించిన వారికి పోస్టింగులు దక్కలేదు. బదిలీలలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ గా పని చేసిన వేణుగోపాల్‌రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం ఇచ్చారు. విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ అయ్యారు. మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం ఇచ్చారు. విశాఖ కలెక్టర్‌గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత బదిలీ అయ్యారు.

ఆమె స్థానంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌గా దినేష్‌కుమార్ నియామకం జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్‌గా సగిలి షణ్మోహన్ ను నియమించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా కె.వెట్రి సెల్వి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా బి.ఆర్.అంబేడ్కర్ లను నియమించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా సి.నాగరాణి, చిత్తూరుజిల్లా కలెక్టర్‌గా సుమిత్‌కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా నియమితులయ్యారు. అదే విధంగా కర్నూలు జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా, బాపట్ల కలెక్టర్‌గా ఆ జిల్లా జేసీకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

అల్లూరి జిల్లా ప్రస్తుత కలెక్టర్ ఎం.విజయ సునీత జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం ఇచ్చారు. కాకినాడ కలెక్టర్ జె.నివాస్ జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జీఏడీకి రిపోర్టు చేయాలని, ప్రస్తుత తూ.గో.జిల్లా కలెక్టర్ మాధవీలత జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం ఇచ్చారు. అలాగే ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం ఇచ్చారు.

Related posts

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రామకృష్ణ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

Bhavani

పంజాబ్ సీఎం భార్యా పిల్లల్ని వేధిస్తున్న ఖలిస్తాన్ వాదులు

Bhavani

విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 77వ స్వాతంత్ర్య వేడుకలు…!

Bhavani

Leave a Comment