39.2 C
Hyderabad
May 4, 2024 22: 57 PM
Slider కృష్ణ

ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రామకృష్ణ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

#APUJ

కాకినాడ జిల్లా, తుని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ రామకృష్ణ పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ.సుబ్బారావు, చందు జనార్ధన్, ఐజేయూ కార్యదర్శి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీరామమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ డిమాండ్ చేశారు. మంత్రి రాజా అనుచరుడు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

వాస్తవానికి మంత్రి అనుచరుడు ఫిర్యాదు చేసే సమయంలో రామకృష్ణ వైజాగ్ లో ఉన్నారన్నారు. మంత్రి అనుచరుడు ను రామకృష్ణ బెదిరించినట్టు ఫిర్యాదు చేయడం, పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం దుర్మార్గం అన్నారు. మంత్రి అనుచరుడు ఫిర్యాదు చేసిన వెంటనే నిజా నిజాలు విచారణ చేయకుండా రామకృష్ణ ఇంటికి వెళ్ళడం, ఇంట్లో వారిని విచారించడం బాధాకరం అన్నారు.

పోలీసు అధికారులు తక్షణం స్పందించి రామకృష్ణ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో డీజీపీ కి ఫిర్యాదు చేయడం తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Related posts

ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర నూత‌న క‌మిటీ ఆవిర్భావం

Satyam NEWS

వెల్ డన్: మంత్రి పువ్వాడకు కేటీఆర్ అభినందన

Satyam NEWS

నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయి

Satyam NEWS

Leave a Comment