23.7 C
Hyderabad
June 28, 2024 06: 05 AM
Slider చిత్తూరు

తిరుపతి రాజస్థాన్ మిత్రమండలిచే ఘన సన్మానం

#naveenkumarreddy

రాజస్థాన్ నుంచి వ్యాపార రీత్యా తిరుపతిలో సుదీర్ఘకాలంగా స్థిరపడిన రాజస్థాన్ మిత్రమండలి సభ్యులు మంగళవారం బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డిని తన కార్యాలయంలో కలిసి రాజస్థాన్ పగడి (SAFA),శాలువతో సత్కరించి స్వీట్ తినిపించి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సమిష్టి సహకారంతో విజయదుందుభి మోగించిందని అభినందించారు.

రాజస్థాన్ మిత్రమండలి సభ్యులు మాట్లాడుతూ తిరుపతి తిరుచానూరు రేణిగుంట చంద్రగిరి ప్రాంతాలలో సుమారు 25 వేల మంది రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకుంటున్నామని తిరుపతి చంద్రగిరి రాజకీయ నాయకుల గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నామని రాబోయే రోజులలో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం తమ వారికి కూడా దేవాలయాలలో అవకాశాలు కల్పించేలా చొరవ చూపాలన్నారు. నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల శ్రీవారి పాదాల చెంత దేశ నలుమూలల నుంచి వ్యాపారాల నిమిత్తం వచ్చి స్థిరపడి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఐకమత్యంగా ఉమ్మడి కుటుంబ సభ్యులుగా స్థానికులతో కలిసి జీవనం కొనసాగించడం ఆనందదాయకమన్నారు.

రాజస్థానీ మిత్రమండలి సోదరులు వ్యాపారంతో పాటు సమాజ హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అలాగే రాజకీయాలలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని దేవాలయాల సంరక్షణలో భాగంగా జిల్లాలోని ప్రముఖ దేవాలయాలలో అధికారికంగా భాగస్వాములు కావాలని అందుకు తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తానని తిరుపతి చంద్రగిరి శాసనసభ్యులతో ఓ సమావేశం ఏర్పాటు చేసి వారి మద్దతు కోరుతామని తెలియజేశారు. నవీన్ కుమార్ రెడ్డి స్పందనకి రాజస్థానీ మిత్ర మండలి సభ్యులు శ్యామ్ చంద్,నేమి చంద్,గోపాల్ చంద్,అనిల్ గౌర్,శైలేందర్ మిశ్రా, జోగారాం,భగీరద్,మోహన్ లాల్ లు కృతజ్ఞతలు తెలియజేశారు

Related posts

ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకే

Bhavani

రిలాక్స్: రేపటి నుంచి చాలా ప్రాంతాలలో వెసులుబాటు

Satyam NEWS

సమ్మిడి వీరారెడ్డి స్మారక మెరిట్ స్కాలర్షిప్ ప్రదానోత్సవం

Satyam NEWS

Leave a Comment